ఒకప్పుడు వైఎస్ జగన్ సభలో ఓ యువకుడు “రప్ప రప్ప” అంటూ సినిమా డైలాగ్ రాసిన ఫ్లెక్సీ పట్టుకున్నాడంటే… రాష్ట్ర రాజకీయాలే ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి వరకు… మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు… కూటమికి వత్తాసు పలికే కొన్ని మీడియా సంస్థల వరకు అందరూ ఒకేసారి రంగంలోకి దిగారు. స్టూడియోల్లో గంటల తరబడి చర్చలు… రాజకీయ ప్రకటనలు… ఖండనలు… విమర్శలు… ఆ హడావుడి చూస్తే రాష్ట్రానికి పెద్ద విపత్తే వచ్చినట్లుండేది.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఫ్లెక్సీలు కాదు… నేరుగా పోలీస్ స్టేషన్లలో ప్రాణాలు పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నా… అధికార పక్షం నిశ్శబ్దంగా ఉండటం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
రప్ప రప్ప ఫ్లెక్సీ లాకప్ డెత్

ఫ్లెక్సీలపై ఫైర్… లాకప్ మరణాలపై సైలెన్స్ ఎందుకు?
అప్పుడు ఫ్లెక్సీని ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా చూపించిన వారు… ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక యువకుడు మరణించాడనే ఆరోపణలపై ఎందుకు మాట్లాడటం లేదు? శవాన్ని, బూడిదను, సీసీటీవీ ఫుటేజీలను సైతం మాయం చేశారనే తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నా… అధికార పక్ష నాయకుల నుంచి ఒక్క గట్టి స్పందన కూడా ఎందుకు రావడం లేదు?
గంగమ్మ అనే మహిళ పోలీస్ స్టేషన్లో మరణించిన ఘటన… పోలీసుల వేధింపులు తట్టుకోలేక క్రాంతికుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన… ఇవన్నీ ప్రజల ముందే జరిగాయని ప్రతిపక్షం చెబుతోంది. అయినా అధికార పార్టీ నేతలు మౌనం పాటించడం వెనుక కారణమేంటి? ఇదేనా వారు చెప్పే పారదర్శక పాలన?
కోడిని కోసినా కేసులు… మనిషి చనిపోతే మౌనమా?
గతంలో వైఎస్సార్సీపీ అభిమానులు కోడి కోశారని… మేక కోశారని… చివరికి కేక్ కట్ చేశారని కూడా కేసులు పెట్టిన ప్రభుత్వం… ఇప్పుడు లాకప్ డెత్‌ల వంటి తీవ్రమైన ఆరోపణల విషయంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది.
ఒక ఫ్లెక్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా చర్చలు పెట్టిన మీడియా… ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల కన్నీళ్లను ఎందుకు చూడడం లేదు? అప్పటి ఆవేశం ఇప్పుడు ఏమైంది? ప్రశ్నలు అడిగే గొంతులు ఒక్కసారిగా ఎందుకు మూగబోయాయి?
రప్ప రప్ప ఫ్లెక్సీ లాకప్ డెత్
“స్వయం ప్రకటిత చెగువేరా”కు ఇప్పుడు మాట రావడం లేదా?
గోడలపై రాతలు, పోస్టర్లపై ఉద్యమాలు చేసిన వారు… ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన వారు… ఇప్పుడు లాకప్ మరణాలపై మాత్రం పెదవి విప్పడం లేదు.
ఒకప్పుడు ప్రతి చిన్న అంశంపై వీరంగం సృష్టించిన “స్వయం ప్రకటిత చెగువేరా”… ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరణాలపై మౌనవ్రతం ఎందుకు పాటిస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.
రప్ప రప్ప ఫ్లెక్సీ లాకప్ డెత్
చివరికి ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇదే..!
ఒక ఫ్లెక్సీకి ప్రభుత్వం మొత్తం స్పందిస్తే… లాకప్ మరణాల ఆరోపణలకు మాత్రం స్పందించకపోవడం ప్రజల్లో అనుమానాలు పెంచుతోందని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం… బాధితులకు మరో న్యాయం ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే…
“ఫ్లెక్సీ పట్టుకుంటే రాజ్యం కదిలింది… లాకప్‌లో ప్రాణాలు పోతే మాత్రం రాజ్యం ఎందుకు మౌనంగా ఉంది?”
రప్ప రప్ప ఫ్లెక్సీ లాకప్ డెత్





