---Advertisement---

🔥 అప్పు చేసి అద్దాల మేడలా…? ₹2,540 కోట్ల అమరావతి ఖర్చుపై మండిపడుతున్న ప్రజలు!

Amaravati buildings ₹2540 crore spending controversy Andhra Pradesh government
---Advertisement---

🟡 ప్రాధాన్యతలపై ప్రశ్నలు రేపుతున్న అమరావతి ఖర్చులు

Amaravati 2540 Crore Spending

రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందంటూ ఒకవైపు చెబుతూ… మరోవైపు అమరావతి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవనాల అద్దాలకు ₹2,540 కోట్లు, అదనంగా ₹798 కోట్లు ఖర్చు చేయాలనే నిర్ణయం ఇప్పుడు ప్రజల్లో అసహనాన్ని పెంచుతోంది.


🔴 హైలైట్స్ – అసలు విషయం ఇదే

  • అమరావతి భవనాల అద్దాలకు ₹2,540 కోట్లు
  • స్పైర్‌, పార్కింగ్ రింగ్‌, అప్రోచ్ బ్రిడ్జిలకు ₹798 కోట్లు
  • లంప్సమ్ కాంట్రాక్టు టెండర్లకు అనుమతి
  • మెడికల్ కాలేజీలకు మాత్రం ఏడాదికి ₹1000 కోట్లు కూడా లేవు
  • నగిషీలు, అలంకరణల పేరుతో వేల కోట్ల ఖర్చు
  • టీడీపీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు 33 ఏళ్ల లీజు
  • పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి
  • CRDAకి భూముల అప్పగింత
  • మంత్రి పయ్యావుల ప్రకటన

“అప్పు చేసి పప్పు కూడు” నుంచి… “అప్పు చేసి అద్దాల మేడలు” వరకు

పాత సామెత చెబుతుంది — “అప్పు చేసి పప్పు కూడు” అని.
కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది…

👉 “అప్పు చేసి అద్దాల మేడలు” అన్నట్టుగా పరిస్థితి తయారైంది.

అయ్యా… అప్పులు చేసి అద్దాల మేడలు తర్వాత కూడా కట్టుకోవచ్చు…
కానీ ఇప్పుడున్న అత్యవసర అవసరాలు ఏమిటి అన్నది ప్రభుత్వం ఆలోచించాల్సిన సమయం కాదా…?


🟣 ప్రజల డిమాండ్ – ముందు అవి ఇవ్వండి!

  • ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్
  • ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్

👉 ముందుగా ఇవి క్లియర్ చేయండయ్యా…! అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


🔵 ₹2,500 కోట్లు ఉంటే ఏమయ్యేది…?

₹2,500 కోట్లు ఖర్చు పెడితే…

👉 ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవయ్యా..!

అంటే ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే రంగాల్లో పెట్టుబడి పెట్టాల్సిన డబ్బు… ఇప్పుడు అద్దాల మేడలపై ఖర్చవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


🟤 ప్రస్తుత పరిస్థితి – నిజంగా ఆలోచించాల్సిందే

  • రాష్ట్రం ఆర్థికంగా వెంటిలేటర్‌పై ఉందన్న వాదనలు
  • నాడు-నేడు పనులు ఆగిపోవడం
  • మెడికల్ కాలేజీల నిర్మాణం నిలిచిపోవడం
  • ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడం
  • ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి

ఇటువంటి సమయంలో అమరావతిలో అద్దాల మేడలకు ఇంత భారీ ఖర్చు పెట్టడం అవసరమా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.


భూముల వివాదం కూడా పెరుగుతోంది

  • టీడీపీ కార్యాలయాలకు 33 ఏళ్ల లీజు
  • పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి
  • రెవెన్యూ నుంచి CRDAకి భూముల అప్పగింత

👉 ఇవన్నీ కలిపి చూస్తే… నిర్ణయాల వెనక ఉద్దేశ్యం ఏమిటి అన్న అనుమానం పెరుగుతోంది.


🔴 ఖర్చుల అసలు లెక్కలు

అంశంఖర్చు
అమరావతి భవనాలు₹2,540 కోట్లు
అదనపు నిర్మాణాలు₹798 కోట్లు
మెడికల్ కాలేజీలు₹1,000 కోట్లు

🔥 అద్దాల మేడలా…? లేక ప్రజల అవసరాలా…? నిర్ణయం ఎవరి కోసం!

ప్రజలకు విద్య, వైద్యం అందించకుండా… అద్దాల మేడలు కడితే దాని వల్ల ఎవరికీ ఉపయోగం…?
అప్పులు చేసి భవనాలు కట్టడం కంటే — ప్రజల జీవితాలు నిలబెట్టడం ముఖ్యమా కాదా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment