---Advertisement---

బీచ్‌లో మందు షాపులే అభివృద్ధా..? ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు ఇవేనా?

విశాఖ బీచ్‌లో బీచ్ షాక్స్ ఏర్పాటు అంశంపై రాజకీయ వివాదాన్ని సూచించే ఫీచర్డ్ ఇమేజ్
---Advertisement---

“బీచ్‌లో మద్యం షాపులు ఏర్పాటు చేస్తే తప్పేంటి?” అనే విశాఖ ఎంపీ శ్రీభరత్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కేంద్రబిందువయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజలు తమ ప్రాంతానికి విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, పరిపాలనా ప్రాధాన్యం కోరుకుంటుంటే… అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం బీచ్‌ల్లో మందు షాపుల గురించి మాట్లాడటమే అభివృద్ధి విజన్‌నా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీచ్ షాక్స్


ఉత్తరాంధ్రకు కావాల్సింది మందు షాపులా… లేక అభివృద్ధా?

ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలుగా తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావాలని, పరిశ్రమలు రావాలని, యువతకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దాలని, మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు, విద్యాసంస్థలు, ఐటీ పెట్టుబడులు పెరగాలని ఆశిస్తున్నారు.

కానీ అలాంటి సమయంలో ప్రజల ఆకాంక్షలపై చర్చ జరగాల్సిన ప్రజాప్రతినిధులు బీచ్‌ల్లో మందు షాపులపై వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.

బీచ్ షాక్స్


బీచ్ ఫెస్టివల్స్, మందు, వినోదం… ఇదేనా కొత్త విజన్?

విశాఖ అంటే కేవలం పర్యాటక నగరం మాత్రమే కాదు. ఇది లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, మత్స్యకారులు, మధ్యతరగతి కుటుంబాల ఆశల నగరం.

అలాంటి నగరాన్ని విద్య, వైద్యం, పరిపాలన, పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా మార్చాలా… లేక బీచ్ ఫెస్టివల్స్, మద్యం, వినోద కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయాలా అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

బీచ్ షాక్స్


గత ప్రభుత్వ అభివృద్ధి పనులపై మరోసారి చర్చ

ఈ వివాదం నేపథ్యంలో గత ప్రభుత్వం ఉత్తరాంధ్రలో చేపట్టిన పలు కార్యక్రమాలు మరోసారి చర్చకు వచ్చాయి. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ, పేదలకు ఇళ్ల నిర్మాణం, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు-నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి.

“ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తే విమర్శలు… మేనిఫెస్టో హామీలను పక్కన పెట్టి మాటలతో మాయ చేస్తే విజనరీ అన్న ప్రశంసలు” అంటూ రాజకీయ విమర్శకులు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు.

బీచ్ షాక్స్


ఉత్తరాంధ్ర ప్రజల తీర్పు ఏమి చెబుతోంది?

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరినైనా గెలిపించే హక్కు కలిగి ఉన్నారు. అదే సమయంలో గెలిచిన నాయకులు ప్రజల ఆశయాలను ప్రతిబింబించే బాధ్యత కూడా కలిగి ఉంటారు.

ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నది తీర ప్రాంతంలో మరిన్ని మందు షాపులా…? లేక ఉద్యోగాలు, పరిశ్రమలు, మెరుగైన విద్యా-వైద్య సదుపాయాలా…? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం రాజకీయ నాయకులపై ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీచ్ షాక్స్


ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకున్నది పరిపాలనా రాజధానినా… బీచ్‌లో మద్యం రాజకీయం నా..?

విశాఖ బీచ్‌లో మద్యం షాపులపై జరిగిన వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ ప్రకటనగా మిగలలేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశపై, ప్రజల ఆకాంక్షలపై, రాజకీయ నాయకుల ప్రాధాన్యతలపై పెద్ద చర్చకు దారి తీశాయి.

ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నది – “మందు, విందు, చిందు” రాజకీయాలా…? లేక “విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి”తో కూడిన భవిష్యత్తా…? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.

బీచ్ షాక్స్

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment