ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. మహిళలకు రక్షణ లేదని, హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు పెరిగిపోయాయని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది.
ఇప్పటి వరకు ఇవి ప్రతిపక్ష ఆరోపణలుగానే కనిపించినా.. అదే అంశాలపై ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.
వైఎస్ఆర్సీపీ మాట పవన్ నోట

తిరుపతిలోనే మొదలైన అసంతృప్తి
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. “రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.. హోంశాఖ విఫలమైంది.. బయటకు వెళితే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు.. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది” అని ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆ వ్యాఖ్యలు అప్పట్లో అధికార వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తాయి.
రెండేళ్లు గడిచినా అదే మాట..!
ఇప్పుడు మరో ఏడాది గడిచింది. కూటమి పాలనకు రెండేళ్లు పూర్తయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ మాటల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.
“నా చేతుల్లో హోంశాఖ లేదు… అది క్రిమినల్స్ అదృష్టం” అని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ దుమారం రేపుతున్నాయి.
ఒకవేళ రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే.. క్రిమినల్స్ అదృష్టం అనే మాట ఎందుకు వచ్చింది? హోంశాఖ పనితీరుపై అసంతృప్తి లేకపోతే ఇలాంటి వ్యాఖ్యల అవసరం ఏమిటి? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.
వైఎస్ఆర్సీపీ మాట పవన్ నోట
వైఎస్ఆర్సీపీ ఆరోపణలకు పవన్ మాటలే బలం ఇస్తున్నాయా?
గత రెండేళ్లుగా వైఎస్ఆర్సీపీ చెబుతున్నది ఒక్కటే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందని, మహిళలకు రక్షణ లేదని, నేరాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని.
ఇప్పుడు అదే అంశాలను అధికార కూటమిలోనే కీలక నేత అయిన పవన్ కళ్యాణ్ కూడా వేరే రూపంలో చెబుతుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. దీంతో “వైఎస్ఆర్సీపీ ఆరోపణలు కేవలం రాజకీయ విమర్శలేనా? లేక అధికార కూటమి నేత వ్యాఖ్యలతో వాటికి బలం చేకూరుతోందా?” అనే చర్చ మొదలైంది.
వైఎస్ఆర్సీపీ మాట పవన్ నోట
రెడ్ బుక్ కీచక పర్వాలకు మేకప్ వేయొచ్చా?
రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, లాకప్ డెత్‌లు, వివిధ హింసాత్మక ఘటనలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలపై సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.
అయితే ఇవన్నీ పక్కనపెట్టి.. జరుగుతున్న ఘటనలకు రాజకీయ మేకప్ వేసి, ప్రచారంతో కవర్ చేయాలని ప్రయత్నించడం సరిపోతుందా? ప్రజల భద్రతకు సంబంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా విమర్శలను తోసిపుచ్చడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయా?
వైఎస్ఆర్సీపీ మాట పవన్ నోట
మాటలు చెబుతున్నది ఎవరు కాదు… పరిస్థితి ఏమిటన్నదే అసలు ప్రశ్న
లా అండ్ ఆర్డర్‌పై వైఎస్ఆర్సీపీ చేసిన ఆరోపణలు, అదే అంశాలపై పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసిన అసంతృప్తి.. ఈ రెండింటి మధ్య ఉన్న పోలిక ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు నిజంగానే సవాళ్లను ఎదుర్కొంటున్నాయా? అయితే బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది చివరకు అధికార యంత్రాంగమే.
వైఎస్ఆర్సీపీ మాట పవన్ నోట





