విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిగినట్టు రాష్ట్ర మహిళా కమిషన్ విచారణలో బయటపడిన విషయం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. విద్యా సంస్థల భద్రతపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏం బయటపడింది?
ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో కొన్ని సిబ్బంది, సంబంధిత వ్యక్తుల ప్రవర్తనపై విద్యార్థినులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టిన మహిళా కమిషన్…
👉 లైంగిక వేధింపులు జరిగినట్లు గుర్తించినట్టు సమాచారం
👉 ప్రిన్సిపల్‌తో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్టు నివేదికలో పేర్కొనబడింది
ఇది ఒక సాధారణ ఘటన కాదని… ప్రభుత్వ విద్యాసంస్థలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
గత ఘటనలే మళ్లీ గుర్తుకు…
ఇదిలా ఉండగా… గతంలో కూడా మహిళలపై వేధింపుల కేసుల్లో
👉 కూటమికి చెందిన నేతలు, పీఏలపై ఆరోపణలు
👉 కానీ నిందితులపై కఠిన చర్యలు లేకపోవడం
👉 బాధితులపైనే కేసులు పెట్టిన ఉదాహరణలు
ప్రత్యేకంగా సాలూరు, రైల్వే కోడూరు ఘటనలు ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చాయి.
👉 కమిటీలు వేయడం
👉 కాలయాపన చేయడం
👉 చివరకు నిందితులు బయటపడిపోవడం
అనే ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.
ప్రజల్లో పెరుగుతున్న అనుమానాలు
ఇప్పుడు విజయవాడ ఘటనలో కూడా అదే సన్నివేశం పునరావృతమవుతుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
👉 ఈసారి నిజంగా నిందితులపై చర్యలు ఉంటాయా?
👉 లేక మళ్లీ కమిటీలు పెట్టి విషయం చల్లార్చేస్తారా?
👉 బాధితులే మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోవాలా?
అని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి
“విద్యార్థినుల భద్రతపై మాటలు చాలాయ్… ఈసారి నిజంగా చర్యలు తీసుకుంటారా?”





