వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన పరిణామాలపై జగన్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా సీఎం పదవి కోసం సంతకాలు సేకరించారనే ప్రచారం రాజకీయంగా విస్తరించింది. అయితే ఈ ఆరోపణల వెనుక నిజం ఏమిటి అనే దానిపై ఇప్పుడు స్పష్టత వస్తోంది.
ఫేక్ ప్రచారం ఏమంటోంది?
వైఎస్సార్ చనిపోయిన సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమిటి? వైఎస్సార్ కనిపించడం లేదని అందరూ ఆందోళన చెందుతుంటే..
సీఎం పదవి గురించి జగన్ సంతకాలు సేకరించలేదా? చేశాను. – అచ్చెన్నాయుడు

ఫ్యాక్ట్ చెక్ ఏమి చెబుతోంది?
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి కూడా జగన్ గారు సంతకాలు సేకరించలేదని ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా చెప్పారు.

జగన్ గారు ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించారనేది తప్పు అని, అది పూర్తిగా అబద్ధం అని నేటి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు.

నిజం తేలింది… అబద్ధాల పరదా తొలిగింది
జగన్‌పై సంతకాల ఆరోపణలు కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేనని స్పష్టమవుతోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత నుంచి తెలంగాణ డిప్యూటీ సీఎం వరకు పలువురు నాయకులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేయడంతో —
ఈ ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని తేలిపోయింది.
ప్రచారం ఎంత పెద్దదైనా, నిజం ఒక్కటే నిలుస్తుంది.





