---Advertisement---

జగన్‌పై చెప్పినవన్నీ నిజాలేనా? ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వాస్తవాలు!

జగన్‌పై అమిత్ షా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆరోపణలపై రాజకీయ ప్రచారాల చర్చ
---Advertisement---

ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఐదేళ్లుగా జగన్‌పై ఎన్నో ఆరోపణలు, కథనాలు, ప్రచారాలు వినిపించాయి.
అవి అప్పట్లో పెద్ద సంచలనాలుగా మారాయి. కానీ ఇప్పుడు వాటిలో కొన్ని విషయాలు తిరిగి చర్చకు వస్తున్నాయి.

అమిత్ షా – జగన్ మీటింగ్ కథ

ఢిల్లీ లో సీఎం జగన్ అమిత్ షాను కలిసిన సమయంలో…
“నీవు బాబు జోలికి ఎందుకు వెళ్తున్నావ్?” అంటూ అమిత్ షా కోపంగా మాట్లాడారని, పళ్ళు పటపట కొరికారని ABN ఆంధ్రజ్యోతి స్క్రోలింగ్ వేసింది.

కానీ ఆ మీటింగ్‌లో నిజంగా ఏమి జరిగింది?
ఆ సమాచారం మీడియాకు ఎవరు ఇచ్చారు?
అన్న ప్రశ్నలకు ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు.

జగన్‌పై తప్పుడు ప్రచారం


వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు

2023 అక్టోబర్ 7న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…

“33 వేల మంది మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం అని కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి” అని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి.

కానీ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత…
2024 నవంబర్ 16న అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు హోంమంత్రి ఇచ్చిన సమాధానంలో…

2019–2024 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు కేవలం 34 మాత్రమే నమోదయ్యాయని, బాధితులు 46 మంది మాత్రమేనని వెల్లడించారు.

దీంతో అప్పటి ఆరోపణలపై ఇప్పుడు మళ్లీ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

జగన్‌పై తప్పుడు ప్రచారం


10 వేల కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కథ

ఒక దశలో “ఎవరో 10 వేల కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కడతాను అన్నాడు… అది జగన్ అయి ఉండొచ్చు” అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కానీ తర్వాత ఆ వ్యక్తి ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖకు లేఖ రాసినా…
అతని ఖాతాలో కనీసం 10 వేల రూపాయలు కూడా లేవని IT అధికారులు చెప్పిన విషయం బయటకు వచ్చింది.

దీంతో ఆ ప్రచారం కూడా వివాదాస్పదమైంది.

జగన్‌పై తప్పుడు ప్రచారం


ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
ఆయన చెప్పిన విషయాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

తర్వాత “ఈ గోల అంతా నాకెందుకు” అన్నట్టుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది.

జగన్‌పై తప్పుడు ప్రచారం


ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే…

జగన్‌పై వచ్చిన ప్రతి ఆరోపణకు నిజంగా ఆధారాలున్నాయా?
లేక రాజకీయ ప్రచారమే ఎక్కువగా నడిచిందా?

ప్రత్యేకంగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన కథనాలపై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

జగన్‌పై తప్పుడు ప్రచారం


ప్రచారాల వెనుక నిజాలు బయటపడుతున్నాయా?

రాజకీయాల్లో ఆరోపణలు సహజమే.
కానీ అవి నిజాలపై ఆధారపడి ఉన్నాయా? లేక ప్రచార యుద్ధంలో భాగమా? అన్నది కాలమే తేలుస్తుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న కూడా అదే…
“జగన్‌పై వచ్చిన ప్రతి వార్తకు నిజంగా రుజువులు ఉన్నాయా?”

జగన్‌పై తప్పుడు ప్రచారం

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment