రాజకీయాల్లో నటనకు కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ కొందరు నేతలు, వారి అనుకూల వర్గాలు, కొందరు సినీ ప్రముఖులు మాత్రం పరిస్థితిని బట్టి పాత్రలు మార్చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న తిరుపతి లడ్డూ పేరుతో దేశమంతా కలకలం రేపిన వారు… నేడు రామాలయం విరాళాల గల్లంతు ఆరోపణలపై మాత్రం ఆశ్చర్యకరమైన మౌనం పాటిస్తున్నారు.
అప్పట్లో అరిచిన గొంతులు… ఇప్పుడు ఎందుకు మూగబోయాయి? ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తోంది.
అప్పటి ఆవేశం ఇప్పటి మౌనం

లడ్డూ పేరుతో రాజకీయాలు… ఇప్పుడు ఎందుకు మౌనం?
తిరుపతి లడ్డూ అంశం వచ్చినప్పుడు… పంది కొవ్వు, చేప కొవ్వు అంటూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినవారు ఎవరు?
ప్రతి టీవీ ఛానెల్‌లో కనిపిస్తూ ధర్మం గురించి ఉపన్యాసాలు ఇచ్చినవారు ఎవరు?
“హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నవారు ఇప్పుడు ఎక్కడున్నారు?
ఇప్పుడు రామాలయం విరాళాల గల్లంతు ఆరోపణలు వినిపిస్తున్నప్పుడు… అదే ఆవేశం ఎందుకు కనిపించడం లేదు?
అప్పుడు ఒక్క ఆరోపణకే మీడియా ముందుకొచ్చినవారు… ఇప్పుడు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు?
అప్పటి ఆవేశం ఇప్పటి మౌనం
ధర్మం కూడా రాజకీయ అవసరానికేనా?
రామతీర్థం ఘటనలో వీధుల్లోకి వచ్చి ఆవేశంగా మాట్లాడినవారు…
కనకదుర్గమ్మ ఆలయ మెట్లను కడుగుతూ కెమెరాల ముందు నిలిచినవారు…
“మహా సంఘటన” జరగాలంటూ ఆస్కార్ స్థాయి నటన ప్రదర్శించినవారు…
ఇప్పుడు అదే ధర్మం, అదే భక్తి, అదే ఆవేశం ఎక్కడికి వెళ్లింది?
ధర్మం నిజంగా పవిత్రమైతే… అది అధికారంలో ఉన్నవారిని బట్టి మారుతుందా?
లేక రాజకీయ అవసరం ఉన్నప్పుడే ధర్మం గుర్తొస్తుందా?
అప్పటి ఆవేశం ఇప్పటి మౌనం
ప్రజలు గమనిస్తున్నారు…
ఈ రోజుల్లో ప్రజలు సోషల్ మీడియాలో చూసేది ఒక్కటే కాదు… గుర్తుంచుకునేది కూడా చాలా ఉంది.
ఎప్పుడు ఎవరు ఏమి మాట్లాడారు…
ఎప్పుడు ఎవరు మౌనం పాటించారు…
అన్నీ ప్రజలకు గుర్తున్నాయి.
రాజకీయ అవసరం ఉన్నప్పుడు ఒక్కసారిగా భక్తులుగా మారి…
అవసరం తీరాక అదే అంశంపై నోరు మూసుకోవడం ప్రజలు గమనించరని అనుకోవడం పొరపాటే.
అప్పటి ఆవేశం ఇప్పటి మౌనం
హామీలు వదిలి… హంగామాలేనా?
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు…
నిరుద్యోగ భృతి…
ఆడబిడ్డ నిధి…
రైతులకు ఇచ్చిన హామీలు…
ఉద్యోగులకు ఇచ్చిన మాటలు…
వాటిపై సమాధానాలు చెప్పాల్సిన సమయం ఇది.
ప్రజలకు పాలన కావాలి… రాజకీయ ప్రదర్శనలు కాదు.
అభివృద్ధి కావాలి… వివాదాల సీరియల్స్ కాదు.
ప్రజలు అన్నీ చూస్తున్నారు… తీర్పు చెప్పే రోజు కూడా వస్తుంది
సినిమా తెరపై ఏసాలు వేస్తే ప్రేక్షకులు చప్పట్లు కొడతారు.
కానీ రాజకీయాల్లో అదే ఏసాలు వేస్తే…
ప్రజలు ప్రశ్నలు వేస్తారు.
నటనకు చప్పట్లు కొట్టొచ్చు…
ద్వంద్వ వైఖరికి మాత్రం తీర్పు చెప్పేది ప్రజలే.
ప్రజాస్వామ్యంలో చివరి మాట నాయకులది కాదు…
ప్రజలదే.
అప్పటి ఆవేశం ఇప్పటి మౌనం





