రికార్డులు ఏమంటున్నాయి? తాడేపల్లి భూమి వివాదంలో బయటపడిన అసలు నిజాలు
తాడేపల్లి హెలిప్యాడ్ ఆరోపణల్లో చంద్రబాబు మాటలు ఎంతవరకు నిజం?
హెలిప్యాడ్ కోసం రైతు భూమిని లాక్కున్నారంటూ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
06-02-2026న ఎమ్మిగన్నూరు సభలో వైయస్ జగన్‌పై చేసిన ఈ వ్యాఖ్యలు నిజమా? లేక రాజకీయ లాభాల కోసం చేసిన తప్పుడు ప్రచారమా?
తాడేపల్లి భూమికి సంబంధించిన కోర్టు వివాదాలు, ప్రభుత్వ రికార్డులు, 22-ఎ నిషేధిత జాబితా ఆధారంగా ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజాన్ని ఈ ఫాక్ట్ చెక్‌లో పరిశీలిద్దాం.
🧾 Fact Check
Fake (ఆరోపణ):
తాడేపల్లిలో రైతు భూమిని లాక్కొని వైయస్ జగన్ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారని చంద్రబాబు ఆరోపించారు.
Fact (నిజం):
* సర్వే నం. 223/226/C2లోని 10.04 ఎకరాల భూమి 2015లోనే అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 22-ఎ నిషేధిత జాబితాలో చేర్చబడింది.
- ఆర్.సి. నం. 22/7 ప్రకారం 2016 నుంచే భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది


Evidence (ఆధారాలు):
• భూ యజమాని–రైల్వే శాఖ మధ్య కోర్టులో వివాదం కొనసాగుతోంది
• ఆర్.సి. నం. 22/7 ప్రకారం 2016 నుంచే భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది
• రైల్వే శాఖ అనుమతితోనే ఈ భూమిలో హెలిప్యాడ్ ఏర్పాటు జరిగింది
Verdict (తీర్పు):
❌ False / Fake Claim
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమిని 22-ఎ నిషేధిత జాబితాలో చేర్చారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం.
ఫాక్ట్ చెక్ ఫలితం:
• జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమిని నిషేధిత జాబితాలో చేర్చలేదు
• రైతు భూమి లాక్కున్నారన్న ప్రచారం తప్పుడు ప్రచారం





