---Advertisement---

యూరియా కోసం రైతుల రోడ్డుపై నిరసన.. ప్రభుత్వ సరఫరా వైఫల్యంపై పెరుగుతున్న ఆగ్రహం!

యూరియా కొరతతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

Summarize with AI

---Advertisement---

రబీ సీజన్ ప్రారంభమైన వేళ రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ఎరువులు అందించాల్సిన ప్రభుత్వం సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎరువుల కోసం రోడ్లపైకి వచ్చిన రైతులు

రబీ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా యూరియా దొరకకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు బుధవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు.

తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కల్లూరు, ముట్టం బాక, పల్లిపాళెం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో యూరియా కోసం రోజులు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

యూరియా కొరత రైతుల నిరసన

10 రోజులుగా యూరియా కోసం ఎదురుచూపులు

వైపు సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నా, మరో వైపు అవసరమైన సమయంలో ఎరువులు అందక రైతులు పంటల దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 10 రోజులుగా యూరియా కోసం కర్రాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదని రైతులు మండిపడ్డారు.

ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి యూరియా అందించాలని, లేకపోతే తమ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

యూరియా కొరత రైతుల నిరసన

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment