---Advertisement---

తిరుమల నెయ్యి టెండర్ల మర్మం: డెయిరీలు మారుతున్నాయా… లేక డొంక చివరకు హెరిటేజ్‌కేనా?

---Advertisement---

తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) నెయ్యి సరఫరా వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా టెండర్లలో కనిపిస్తున్న డెయిరీల పేర్లు, ల్యాబ్ టెస్టుల్లో వచ్చిన ఫలితాలు, మళ్లీ మళ్లీ అదే సంస్థలకు అవకాశాలు రావడం వంటి అంశాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఇందాపూర్, భోలేబాబా, AR డెయిరీ, శ్రీ వైష్ణవి వంటి పేర్లు ఈ కథలో వరుసగా వినిపిస్తున్నాయి. ఒక డెయిరీ వివాదంలో చిక్కుకున్న తర్వాత మరో పేరుతో మళ్లీ ఎంట్రీ ఇస్తోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇందాపూర్ డెయిరీ కథ

సంవత్సరం / తేదీఏమైంది
2015టీటీడీకి నెయ్యి సరఫరా ప్రారంభం
2015కిలో నెయ్యి ధర రూ.295
2016 మార్చి 18ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ నెయ్యి ఫెయిల్
2016కృత్రిమ నెయ్యి సరఫరా కారణంగా డిస్‌క్వాలిఫై
2018మళ్లీ ఇందాపూర్ డెయిరీకి అవకాశం
2018కిలో నెయ్యి ధర రూ.354
2019–2024టెండర్లలో పాల్గొన్న ఇందాపూర్
2025 డిసెంబర్మళ్లీ టెండర్‌లో ఎంట్రీ
2025కిలో నెయ్యి ధర రూ.658
ఇందాపూర్ పాలిటిక్స్ మానిఫ్యాక్చరింగ్ యూనిట్ అనే విమర్శలు

భోలేబాబా డెయిరీ కథ

తేదీ / సంవత్సరంఏమైంది
2018హైర్ ప్రైస్ డెయిరీ పేరుతో కాంట్రాక్ట్ ఎంట్రీ
2018పాలు సేకరించే సామర్థ్యం లేని డెయిరీ అనే ఆరోపణలు
2018నెయ్యి సరఫరా సామర్థ్యం లేకపోయినా టెండర్ ఎంట్రీ
2018 జూన్ 26ఫేక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్
డొంగ సర్టిఫికేట్లతో నెయ్యి సరఫరా టెండర్
2019 మార్చి 682 వేల కేసులు నెయ్యి సరఫరా ఆర్డర్
బాబు సీఎం గా ఉన్నంత వరకు భోలేబాబా చక్రం
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత భోలేబాబా డెయిరీకి చెక్
సీబీఐ దర్యాప్తులో పదేపదే వినిపిస్తున్న పేరు
పాలిటిక్స్‌లో భాగస్వామ్యం ఉన్నట్టు భోలేబాబా ప్రకటన

AR డెయిరీ – శ్రీ వైష్ణవి లింక్

తేదీఏమైంది
2024 జూలైతిరుమలకు AR డెయిరీ నెయ్యి ట్యాంకర్లు
2024 జూలై 23NDDB రిపోర్ట్
2024 జూలై 25AR డెయిరీకి చెందిన 4 ట్యాంకర్లు ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్
ఫెయిల్ అయిన ట్యాంకర్లు రిజెక్ట్
2024 జూలై 27శ్రీకాళహస్తికి చెందిన 4 నెయ్యి ట్యాంకర్లు
ఆగస్టు – సెప్టెంబర్ 2024శ్రీ వైష్ణవి పేరుతో నెయ్యి సరఫరా
అదే కృత్రిమ నెయ్యి వాడుతున్నారనే ఆరోపణలు
భోలేబాబా → AR డెయిరీ → శ్రీ వైష్ణవి లింక్ చర్చ
శ్రీ వైష్ణవి డెయిరీకి సంఘం డెయిరీతో వ్యాపార సంబంధాలు
సంఘం డెయిరీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చెందినది అనే ఆరోపణ
లింకులు బయటపడగానే గోడలు పెయింట్ చేసిన ఘటనలు

డెయిరీలు మారినా… కథ అదేనా?

తిరుమల నెయ్యి సరఫరా వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక టెండర్ కథ మాత్రమే కాదు. ఇందులో డెయిరీలు, టెండర్లు, ల్యాబ్ టెస్టులు, రాజకీయ సంబంధాలు అన్నీ కలిసి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇందాపూర్ నుంచి భోలేబాబా… అక్కడి నుంచి AR డెయిరీ, శ్రీ వైష్ణవి వరకు వస్తున్న ఈ లింక్ నిజంగా ఏమిటి అన్నది పూర్తిగా బయటకు రావాల్సి ఉంది.

డెయిరీలు మారుతున్నాయా… లేక పేర్లు మాత్రమే మారుతున్నాయా అనే ప్రశ్నకు సమాధానం దర్యాప్తు పూర్తిగా వెలుగులోకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment