---Advertisement---

తిరుమల నెయ్యి కల్తీ ఆరోపణలు: భోలే బాబా డెయిరీకి అనుమతులు ఎవరి హయాంలో ఇచ్చారు?

---Advertisement---

భోలే బాబా డెయిరీ ద్వారా తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందంటూ కూటమి నాయకులు, ఎల్లో మీడియ ఆరోపణలు చేస్తున్నాయి. కానీ అధికారిక రికార్డులు చూస్తే, ఆ కంపెనీకి టెక్నికల్ అర్హతలు ఇచ్చి, నెయ్యి సరఫరా టెండర్లు మంజూరు చేసినది చంద్రబాబు నాయుడు హయాంలోనే అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

❌ Fake

  • భోలే బాబా డెయిరీ ద్వారా వైయస్సార్‌సీపీ హయాంలో నెయ్యి కల్తీ చేశారన్న ప్రచారం
  • కంపెనీకి ఒక్క ఆవు కూడా లేదని, నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదన్న ఆరోపణలు

❌ Fake ప్రచారం

Fact:

  • భోలే బాబా డెయిరీకి (మునుపటి పేరు: హర్షష్ ఫ్రెష్ డైరీ) అనుమతులు ఇచ్చి ద్వారాలు తెరిచింది చంద్రబాబు సర్కారే.
  • 06 మార్చి 2019న భోలే బాబా డెయిరీని టెక్నికల్‌గా క్వాలిఫై చేస్తూ నెయ్యి సరఫరాకు అధికారిక అనుమతి ఇచ్చింది కూడా చంద్రబాబే.
  • 2019 ప్రారంభంలో నెయ్యి టెండర్లలో కఠిన నిబంధనలు తీసుకొచ్చామని టీడీపీ కూటమి చెబుతున్నా, వైయస్సార్‌సీపీ ప్రభుత్వం రాకముందే భోలే బాబా డెయిరీ టెక్నికల్‌గా క్వాలిఫై అయిందని నాటి టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.
  • 06 మార్చి 2019న భోలే బాబా డెయిరీకి 82,000 కేజీల నెయ్యి సరఫరాకు టిన్నుల ద్వారా టెండర్ ఇచ్చారు.
    ఈ టెండర్ కూడా టీడీపీ హయాంలోనే మంజూరై, కేజీ ధరను రూ.291గా నిర్ణయించారు.
  • 19 ఏప్రిల్ 2019న ఇప్పటికే ఇచ్చిన 82,000 కేజీలతో పాటు మరో 12,300 కేజీల నెయ్యి సరఫరాకు అదనపు ఆర్డర్ కూడా ఇచ్చారు.
  • ఈ నిర్ణయం కూడా చంద్రబాబు హయాంలోనే తీసుకున్నారు.
  • 20 జూన్ 2018న టెక్నికల్ బిడ్‌లో డిస్‌క్వాలిఫై చేసిన భోలే బాబా డెయిరీకి, అదే చంద్రబాబు ప్రభుత్వం తర్వాత నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చింది.
  • ఒక్క ఆవు కూడా లేదని, నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని ఆరోపిస్తున్న భోలే బాబా డెయిరీకే చంద్రబాబు హయాంలోనే పర్మిషన్లు, టెండర్లు ఇచ్చారు.
  • జంతువుల కొవ్వు ఉందని ఆరోపిస్తున్న నాలుగు నెయ్యి ట్యాంకర్లు కూడా చంద్రబాబు హయాంలోనే సప్లై అయ్యాయి.
  • ఆ నాలుగు నెయ్యి ట్యాంకర్లను 25 జులై 2024న టీటీడీ గోదాం నుంచి వెనక్కి పంపినట్టు, 05 మే 2025న దాఖలైన మొదటి చార్జ్‌షీట్‌లో సీబీఐ–సిట్ స్పష్టంగా పేర్కొంది.
  • వెనక్కి పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లు మళ్లీ టీటీడీకి వచ్చి, వాటిని లడ్డూ ప్రసాదంలో ఉపయోగించినట్టు **23-01-2026న దాఖలైన SIT Final Supplementary Charge Sheet (పేజీ 44)**లో స్పష్టంగా పేర్కొన్నారు.

2018 నుంచి 2026 వరకూ నెలవారీ రికార్డులు చూస్తే, భోలే బాబా డెయిరీకి సంబంధించిన టెక్నికల్ అనుమతులు, టెండర్లు, నెయ్యి సరఫరా, ట్యాంకర్ల వ్యవహారం అన్నీ చంద్రబాబు హయాంలోనే ప్రారంభమై జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం అంతా చంద్రబాబు హయాంలోనే జరిగింది. అందుకే దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడిదే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment