మెగా డీఎస్సీ స్కామా లోకేష్‌కు ఎదురవుతున్న సంచలన ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన “మెగా డీఎస్సీ” ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా.. లక్షలాది ఉద్యోగార్థుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తున్నాయి. “ఇది నిజంగా రిక్రూట్‌మెంటా?.. లేక వేలం పాటా?” అంటూ మంత్రి లోకేష్‌ను జగన్ నిలదీయడం రాజకీయంగా సంచలనంగా మారింది.
పేపర్ లీక్‌లు… డేటా డిలీట్… మెరిట్ లిస్టుల మాయం… స్పోర్ట్స్ కోటా పోస్టుల బేరసారాలు… ఇలా ఒక్కొక్క అంశంపై జగన్ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగా డీఎస్సీ స్కామా లోకేష్‌కు ఎదురవుతున్న సంచలన ప్రశ్నలు

“మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేశారు”
జగన్ తన ప్రకటనలో కీలక ఆరోపణ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డీఎస్సీని ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి, ఆలస్యం చేసి, మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు.
“కొత్త డీఎస్సీని ఉద్యోగాల కోసం కాకుండా… పబ్లిసిటీ కోసం వాడుకున్నారు. చివరికి పరీక్షల్లో చేసిన నిర్వాకాలతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు” అంటూ మండిపడ్డారు.
“మెగా డీఎస్సీ కాదు.. మెగా లీక్.. మెగా అవినీతి”
డీఎస్సీ పరీక్షల నిర్వహణ మొత్తం అనుమానాస్పదంగా మారిందని జగన్ ఆరోపించారు. పరీక్షల ముందు నుంచే పేపర్ లీక్‌లు జరిగాయని, తర్వాత ఆధారాలు మాయం చేసే ప్రయత్నం జరిగిందని అన్నారు.
“పేపర్లు లీక్ అయ్యాయి… డేటా డిలీట్ చేశారు… మెరిట్ లిస్టులు మాయం చేశారు… ఇది ఉద్యోగాల భర్తీనా? లేక డబ్బులు పెట్టిన వాళ్లకు పోస్టులు అమ్ముకునే వ్యవస్థనా?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
SCERT ఉద్యోగికి టాప్ ర్యాంక్ ఎలా వచ్చింది?
పరీక్ష నిర్వహణలో కీలకంగా పాల్గొన్న SCERT అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికే మొదటి ర్యాంక్ రావడం వెనుక పెద్ద అనుమానాలున్నాయని జగన్ ప్రశ్నించారు.
“అతనికి టాప్ ర్యాంక్ ఎలా వచ్చింది?.. ఆ తర్వాత అతని వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు?.. టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?” అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.
మెగా డీఎస్సీ స్కామా లోకేష్‌కు ఎదురవుతున్న సంచలన ప్రశ్నలు
మెరిట్ లిస్టులు ఎందుకు దాచారు?
డీఎస్సీ ఎంపికల ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా మాయమైందని జగన్ ఆరోపించారు.
“మెరిట్ లిస్టులను ఎందుకు బయట పెట్టలేదు?.. కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపిక జాబితాలు ఎందుకు ప్రదర్శించలేదు?.. సెలెక్ట్ అయిన వారికే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపించారు?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
“అన్నీ సక్రమంగా జరిగి ఉంటే దాచాల్సిన అవసరం ఏముంది?” అని ప్రశ్నించారు.
మెగా డీఎస్సీ స్కామా లోకేష్‌కు ఎదురవుతున్న సంచలన ప్రశ్నలు
స్పోర్ట్స్ కోటాలో రూ.15 లక్షల డీల్స్?
స్పోర్ట్స్ కోటా పోస్టుల విషయంలో జగన్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. రూ.15 లక్షల వరకు డబ్బులు తీసుకుని పోస్టులు ఇచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
“మీ పార్టీకి చెందిన నాయకులే ఈ డీల్స్ కుదిర్చారా?.. ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగుపెట్టని వాళ్లకు కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారా?.. ఇంటికే పిలిచి బేరసారాలు చేశారా?” అంటూ జగన్ ప్రశ్నించారు.
మెగా డీఎస్సీ స్కామా లోకేష్‌కు ఎదురవుతున్న సంచలన ప్రశ్నలు
“రిక్రూట్‌మెంటా?.. లేక వేలం పాటా?”
జగన్ తన విమర్శల్లో అత్యంత తీవ్రంగా ప్రస్తావించిన అంశం ఇదే. డబ్బులు ఉన్నవారికి పోస్టులు.. ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరిగిందని ఆరోపించారు.
“ఇది ప్రభుత్వ నియామక ప్రక్రియా?.. లేక పోస్టులను వేలం వేసే వ్యవస్థా?.. ప్రతిభతో చదివిన నిరుద్యోగుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నారు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెగా డీఎస్సీ స్కామా లోకేష్‌కు ఎదురవుతున్న సంచలన ప్రశ్నలు
టెట్ కన్వీనర్‌ను ఎందుకు మార్చారు?
టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారిని ఉన్నపళంగా తొలగించి, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు నియమించారని జగన్ ప్రశ్నించారు.
“దీనివెనుక అసలు మతలబు ఏమిటి?.. ఎవరిని కాపాడటానికి ఈ మార్పులు చేశారు?” అంటూ లోకేష్‌ను నేరుగా టార్గెట్ చేశారు.
మెగా డీఎస్సీ స్కామా లోకేష్‌కు ఎదురవుతున్న సంచలన ప్రశ్నలు
“లోకేష్ బాధ్యత వహించాలి”
ఈ మొత్తం వ్యవహారానికి మంత్రి లోకేష్ రాజకీయ బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు. వెంటనే పదవి నుంచి తప్పుకుని, స్వతంత్ర సీబీఐ విచారణకు అనుమతించాలని కోరారు.
“మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా… ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. వెంటనే సీబీఐ దర్యాప్తు జరపండి” అంటూ జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
మెగా డీఎస్సీ స్కామా లోకేష్‌కు ఎదురవుతున్న సంచలన ప్రశ్నలు
“మెగా డీఎస్సీపై వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు?.. నిరుద్యోగులకు నిజంగా న్యాయం జరుగుతుందా?”
మెగా డీఎస్సీ ఇప్పుడు కేవలం ఉద్యోగ నియామకాల అంశంగా కాకుండా… రాష్ట్ర రాజకీయాల్లో భారీ దుమారం రేపుతున్న అంశంగా మారింది. జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇస్తుందా?.. లేక ఈ ఆరోపణలు మరింత పెద్ద రాజకీయ తుఫాన్‌గా మారతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే ఒక విషయం మాత్రం స్పష్టం — ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధమైన వేలాది మంది నిరుద్యోగులు ఇప్పుడు ఒక్కటే కోరుతున్నారు… “నిజం బయటకు రావాలి… ప్రతిభకు న్యాయం జరగాలి.”
మెగా డీఎస్సీ స్కామా లోకేష్‌కు ఎదురవుతున్న సంచలన ప్రశ్నలు





