రాజకీయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక విషయం. కానీ జరిగిన చారిత్రక ఘటనలపై అధికారిక పత్రాలను పక్కనపెట్టి అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడం మరో విషయం. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని రాజకీయ వర్గాల్లో LG పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జగన్ ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇవ్వలేదనే ప్రచారం సాగుతోంది.
అయితే ఈ ప్రచారం చేస్తున్నవారు ప్రభుత్వ అధికారిక ఉత్తర్వు G.O.RT.No.449 చదివారా? లేక చదివినా ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
LG పాలిమర్స్ పరిహారం G.O. 449

కోటి రూపాయల పరిహారం ప్రకటించలేదన్న ప్రచారం వెనుక అసలు కథ ఏమిటి?
LG పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన దేశాన్ని కుదిపేసిన విషాదం. అనేక కుటుంబాలు తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని కోల్పోయాయి. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు భారీ స్థాయిలో ఆర్థిక సహాయం ప్రకటించింది.
కానీ ఇప్పుడు కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం “కోటి రూపాయలు ప్రకటించారు కానీ ఇవ్వలేదు” అనే కథనాన్ని ముందుకు తెస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ వాదనకు మద్దతుగా ఎలాంటి అధికారిక ఆధారాలు చూపడం లేదు.
LG పాలిమర్స్ పరిహారం G.O. 449
G.O.RT.No.449 ఏం చెబుతోంది?
2020 మే 8న విడుదలైన G.O.RT.No.449లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఆ ఉత్తర్వులో:
మరణించిన వారి కుటుంబాలకు
✅ ప్రతి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం
ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి
✅ ప్రాథమిక చికిత్స పొందిన వారికి రూ.25,000
✅ 2 లేదా 3 రోజులు ఆసుపత్రిలో ఉన్న వారికి రూ.1 లక్ష
✅ వెంటిలేటర్‌పై చికిత్స పొందిన వారికి రూ.10 లక్షలు
ప్రభావిత గ్రామాల ప్రజలకు
✅ ఒక్కొక్కరికి రూ.10,000 ఆర్థిక సహాయం
ఇవన్నీ అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులో స్పష్టంగా నమోదయ్యాయి.
LG పాలిమర్స్ పరిహారం G.O. 449


G.O.లో నల్లపై తెల్లగా ఉన్న విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు?
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది.
ప్రభుత్వ ఉత్తర్వులో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన విషయం స్పష్టంగా ఉన్నప్పటికీ, ఆ అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టి ప్రజల్లో సందేహాలు సృష్టించే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది?
రాజకీయ విమర్శలు చేయాలంటే వాస్తవాల ఆధారంగా చేయాలి. కానీ అధికారిక పత్రాల్లో ఉన్న సమాచారాన్ని దాచిపెట్టి ప్రచారం చేయడం రాజకీయ నిజాయితీకి నిదర్శనం కాదు.
ఒకవేళ పరిహారం పంపిణీపై ఎవరికైనా సందేహాలు ఉంటే, సంబంధిత అధికారిక రికార్డులు, లబ్ధిదారుల జాబితాలు, జిల్లా యంత్రాంగ నివేదికలు ఆధారంగా చర్చ జరగాలి. కానీ “ప్రకటించలేదే”, “ఇవ్వలేదే” అంటూ ప్రచారం చేయడం వాస్తవాలను వక్రీకరించడమే అవుతుంది.
LG పాలిమర్స్ పరిహారం G.O. 449
సోషల్ మీడియా ప్రచారం కంటే ప్రభుత్వ పత్రాలే ప్రమాణం
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ కావడానికి కొన్ని నిమిషాలే సరిపోతాయి. కానీ ఒక అబద్ధం వందసార్లు చెప్పినా అది నిజం కాదు.
LG పాలిమర్స్ ఘటన విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన G.O. 449 అందుబాటులో ఉంది. అందులో పరిహారం వివరాలు స్పష్టంగా ఉన్నాయి. అలాంటప్పుడు అధికారిక పత్రాలను పక్కనపెట్టి కొత్త కథనాలు అల్లడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగానే కనిపిస్తోంది.
LG పాలిమర్స్ పరిహారం G.O. 449
నిజాలు G.O.లో ఉన్నాయి… మరి అబద్ధాల ప్రచారం ఎందుకు?
LG పాలిమర్స్ బాధితులకు కోటి రూపాయల పరిహారం ప్రకటించలేదన్నా, ప్రకటించిన మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించలేదన్నా చెప్పడం పూర్తిగా వాస్తవాలకు విరుద్ధం. G.O.RT.No.449లో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం మంజూరు చేసిన విషయం స్పష్టంగా నమోదై ఉంది.
అందుకే ప్రశ్న ఒక్కటే…
అధికారిక G.O.లో నల్లపై తెల్లగా కనిపిస్తున్న నిజాన్ని కూడా కాదని చెప్పేంత రాజకీయ గజ్జి కొందరికి ఎందుకు పట్టింది? ప్రజలకు నిజాలు తెలియకూడదనే భయమా? లేక వాస్తవాల కంటే ప్రచారమే ముఖ్యమా?
LG పాలిమర్స్ పరిహారం G.O. 449





