---Advertisement---

హెరిటేజ్–ఇందాపూర్ నెయ్యి వివాదం నుంచి తప్పించుకోవడానికేనా… ప్లకార్డు ఫోటోపై సృష్టించిన రాజకీయ దుమారం?

---Advertisement---

హెరిటేజ్–ఇందాపూర్ నెయ్యి వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్న వేళ, ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు “రక్షించు గోవిందా” అంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయగా, ఆ ప్లకార్డును బూట్లతో పట్టుకున్నారన్న అంశాన్ని తెలుగుదేశం పార్టీ పెద్ద వివాదంగా మలచింది. వెంటనే వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తూ భక్తి అంశాన్ని ప్రధాన అజెండాగా ముందుకు తెచ్చింది.

ఢిల్లీలో ప్రతిమ అందజేత ఫుల్ ఫోటో బయటపడటంతో వెలుగులోకి వచ్చిన అసలు ప్రశ్నలు

ఇదే సమయంలో గతంలో ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసినప్పుడు, తిరుమల ఏడుకొండల ప్రతిమను బూట్లు ధరించి అందజేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు వచ్చాయి. టీడీపీ నేతల సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం బూట్లు కనిపించకుండా జాగ్రత్తగా తీసిన ఫోటోలు మాత్రమే షేర్ చేయబడ్డాయి. అయితే నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ఖాతాలో పూర్తి ఫోటో బయటపడటంతో బూట్లు స్పష్టంగా కనిపించాయి.

దీంతో విమర్శకులు ప్రశ్నిస్తున్నారు—అప్పుడు ప్రశ్నించని వారు, ఇప్పుడు ప్లకార్డు అంశాన్ని పెద్ద ఇష్యుగా ఎందుకు తీసుకొచ్చారు? ఇది నిజంగా భక్తి పరిరక్షణా? లేక హెరిటేజ్–ఇందాపూర్ నెయ్యి వివాదం నుంచి దృష్టి మళ్లించే రాజకీయ వ్యూహమా?

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment