---Advertisement---

ఉచితాల పేరుతో పేదలపై ముద్ర..! పెద్దలకు దోచిపెడితే అది అభివృద్ధా..?

ఉచితాలా రాయితీలా - పేదలకు సంక్షేమ పథకాలు, పెద్దలకు రాయితీలపై రాజకీయ చర్చను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

Summarize with AI

---Advertisement---

పేదలకు ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందట..! కానీ వేల కోట్ల రూపాయల భూములు, రాయితీలు, పన్ను మినహాయింపులు, ప్రభుత్వ ఆస్తులు పెద్ద పెద్ద కార్పొరేట్ వర్గాలకు అప్పగిస్తే అది మాత్రం అభివృద్ధి అట..! ఇదే ఇప్పుడు దేశంలో నడుస్తున్న కొత్త ఆర్థిక సిద్ధాంతమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇటీవల కొందరు మాజీ అధికారులు, స్వయంఘోషిత మేధావులు ఉచిత సంక్షేమ పథకాలపై ఉద్యమం మొదలుపెడతామంటూ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమయ్యాయి.

ఉచితాలా రాయితీలా


ఎన్నికల ముందు హామీలు ఇస్తే అభివృద్ధి.. ఎన్నికల తర్వాత ఉచితాలా..?

ఎన్నికల సమయంలో ప్రజలకు వందలాది హామీలు ఇస్తారు. సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు అడుగుతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అదే హామీలను “ఉచితాలు”గా చిత్రీకరిస్తారు.

హామీలు ఇచ్చినప్పుడు ఆర్థిక క్రమశిక్షణ గుర్తుకు రాదా..? అప్పుల భారం గుర్తుకు రాదా..? ప్రజల ముందు భారీ హామీలు ప్రకటించి, వాటిని అమలు చేయలేని పరిస్థితి వచ్చిన తర్వాత ప్రజలనే తప్పుబట్టడం రాజకీయ మోసం కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


పేదలకు ఇచ్చేది ఉచితం.. పెద్దలకు ఇచ్చేది రాయితీ అనే కొత్త నిర్వచనమా..?

ఒక పేద కుటుంబానికి ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం అందిస్తే దానిని “ఫ్రీబీ” అంటారు. అదే పెద్ద కంపెనీలకు వేల ఎకరాల భూములు, పన్ను మినహాయింపులు, చౌక ధరలకు ప్రభుత్వ ఆస్తులు కట్టబెడితే దానిని “ఇన్వెస్ట్‌మెంట్” లేదా “అభివృద్ధి”గా పిలుస్తారు.

ఈ ద్వంద్వ ప్రమాణాలపై ఎవరూ మాట్లాడరా..? పేదల సంక్షేమం దేశానికి భారమైతే, కార్పొరేట్ రాయితీలు దేశానికి వరమా..? అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.


జగన్ హయాంలో కరోనా వచ్చింది.. అయినా సంక్షేమం ఆగలేదు

వైఎస్ జగన్ పాలనలో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి రెండు సంవత్సరాలు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. అయినప్పటికీ సంక్షేమ పథకాలు నిలిపివేయకుండా, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇచ్చిన హామీలను అమలు చేశామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

అలాంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమాన్ని కొనసాగించిన ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, ఇప్పుడు భారీ అప్పులు, ప్రభుత్వ ఆస్తుల విక్రయాల ఆరోపణలపై ఎందుకు నోరు విప్పడం లేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఉచితాలా రాయితీలా


వేల కోట్లు ఎగవేసిన వారు సోమరిపోతులు కారా..?

వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని బ్యాంకులను ముంచేసినవారు సోమరిపోతులు కారా..? ప్రభుత్వ భూములు, సంస్థలను చౌకగా సొంతం చేసుకున్నవారు ఆర్థిక వ్యవస్థకు భారమా కాదా..?

రోజువారీ జీవిత పోరాటంలో ఉన్న పేద కుటుంబాలకు అందే కొన్ని వందలు, కొన్ని వేల రూపాయల సహాయాన్ని మాత్రమే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదంగా చిత్రీకరించడం సామాజిక వివక్ష కాదా అని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉచితాలా రాయితీలా


ఉచితాలపై కన్నీళ్లు.. దోపిడీపై మౌనమా..?

పేదలకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలపై ఆవేదన వ్యక్తం చేసే మేధావులు, వేల కోట్ల ప్రజా సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లినప్పుడు ఎందుకు స్పందించడం లేదు..? ప్రభుత్వ రంగ సంస్థలు, భూములు, విలువైన ఆస్తుల బదిలీలపై ఎందుకు ఉద్యమాలు కనిపించడం లేదు..?

పేదలకు ఇచ్చిన వెయ్యి రూపాయలపై కన్నీళ్లు పెట్టుకునే వారు, పెద్దలకు దోచిపెడుతున్న వేల కోట్లపై ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు రాజకీయంగా మరింత బలంగా వినిపిస్తున్నాయి.

ఉచితాలా రాయితీలా


పేదలకు ఇచ్చేది ఉచితమా..? పెద్దలకు ఇచ్చేది దోపిడీయా..? ప్రజలే తీర్పు చెప్పాలి!

పేదలకు ఇచ్చేది ఉచితం కాదు… అది ప్రభుత్వ బాధ్యత, సామాజిక న్యాయం. పెద్దలకు ఇచ్చేది రాయితీ కాదు… ప్రజా సంపదను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించే విధానం అయితే దానిపై కూడా అదే తీవ్రతతో చర్చ జరగాలి. పేదలకు ఇచ్చే సంక్షేమాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని “సోమరిపోతులు” అనే ముద్ర వేయడం మానేసి, అసలు దేశ సంపద ఎక్కడికి వెళ్తోంది..? ఎవరి చేతుల్లోకి వెళ్తోంది..? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉచితాలా రాయితీలా

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment