ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగంలో కీలకంగా భావిస్తున్న ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ వర్కర్స్ ప్లాట్‌ఫాం ప్రాజెక్ట్ ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈ ప్రాజెక్ట్‌లో టెండర్ ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అర్హతలేని కంపెనీలకు అవకాశాలు కల్పించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
🟡 ప్రాజెక్ట్ ఏమిటి?
- ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ వర్కర్స్ ప్లాట్‌ఫాం ప్రాజెక్ట్
- ఆరోగ్య సేవలను డిజిటల్‌గా పర్యవేక్షించేందుకు ప్లాన్
- సుమారు రూ.40 కోట్ల విలువైన కాంట్రాక్ట్
🟡 టెండర్ నిబంధనలు ఏమంటున్నాయి?
- టెండర్ నిబంధనల ప్రకారం
ఏబీడీఎం (ABDM)తో భాగస్వామ్యం ఉన్న కంపెనీలకే అర్హత - కానీ…
ఈ కీలక నిబంధనను పక్కన పెట్టినట్లు ఆరోపణలు
🟡 అర్హతలేని కంపెనీకి అవకాశం ఎలా?
- ఏబీడీఎంతో భాగస్వామ్యం లేకపోయినా
ఒక కంపెనీ బిడ్‌ను - ప్రీ-క్వాలిఫికేషన్ దశలోనే ఆమోదించారా? అన్న సందేహాలు
- ఇది నిజమైతే
టెండర్ పారదర్శకతపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి
🟡 అడ్డదారుల్లో కాంట్రాక్ట్ కట్టబెట్టే ప్రయత్నాలు?
- ఉద్యోగుల ముఖ హాజరు (Face Attendance) చూసే కంపెనీకి
- ఈ భారీ హెల్త్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇవ్వాలని ప్రయత్నాలు
- నిబంధనలకు విరుద్ధంగా
అడ్డదారుల్లో కాంట్రాక్ట్ కట్టబెట్టే యత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు
🟡 మెడికల్ అనుభవం లేకపోయినా ఎంపిక?
- కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్న సంస్థకు
హెల్త్ డిజిటల్ మిషన్ (ABDM) అనుభవం లేకపోవడం - అయినా కూడా
టెండర్ ప్రక్రియలో ముందుకు తీసుకువెళ్తున్న తీరు - ఇది సందేహాలకు తావిస్తోంది
🟡 వైద్యమా..? నైవేద్యమా..?
- టెండర్ బిడ్ల పరిశీలనలో
భాగస్వామ్యం ఉన్న కంపెనీలను పక్కన పెట్టి - అర్హతలేని సంస్థకు ప్రాధాన్యం ఇవ్వడం
- ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రాజెక్ట్
ప్రైవేట్ ప్రయోజనాల కోసం మళ్లించబడుతున్నదా? అన్న అనుమానం
🟡 భారీ ఆర్థిక ప్రయోజనాల కోణం
- సుమారు రూ.40 కోట్ల కాంట్రాక్ట్
- ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో
అక్రమాలకు అవకాశం ఉందా? - నిబంధనలు వక్రీకరించి
ప్రయోజనాలు కల్పిస్తున్నారా అన్న అనుమానాలు
ఆరోగ్య సేవల మెరుగుదల పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా..? లేక టెండర్ ప్రక్రియలో అవకతవకలతో కొందరికి లాభం చేకూర్చడానికేనా..? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది ప్రభుత్వం.






