అనంతపురం మేయర్ ఎన్నికలు
నారా లోకేష్ అండదండలతో అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సాగిస్తున్నారనే ఆరోపణలు, స్థానికంగా పెరుగుతున్న రాజకీయ అసంతృప్తి చివరకు అధికార పార్టీకి ఎదురుదెబ్బగా మారాయా? మేయర్ పీఠాన్ని భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికార బలం, అండదండలు, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రజాభిప్రాయాన్ని మాత్రం మార్చలేరని అనంతపురం ఓటర్లు తమ తీర్పుతో చాటిచెప్పారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అనంతపురం మేయర్ ఎన్నికలు

అధికార బలం ఉన్నా.. ప్రజా తీర్పు ముందు టీడీపీకి ఎదురుదెబ్బ!
పోలింగ్ సమయంలో టీడీపీ కార్యకర్తలు కండువాలతో పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలు, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వైఎస్సార్సీపీకి లభించిన ప్రజా మద్దతు ముందు కూటమి ప్రయత్నాలు ఫలించలేదని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
తమకు బలమైన పట్టుందని భావించిన ప్రాంతాల్లోనూ అధికార పార్టీకి ఆశించిన ఫలితం దక్కకపోవడం టీడీపీ నాయకత్వానికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. చివరకు మేయర్ పీఠాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకోవడం అనంతపురం రాజకీయాల్లో కీలక పరిణామంగా నిలిచింది.
అనంతపురం మేయర్ ఎన్నికలు
దగ్గుపాటి వ్యవహారాలే టీడీపీకి ప్రతికూలంగా మారాయా?
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై స్థానికంగా వినిపిస్తున్న కబ్జాలు, వ్యాపారుల నుంచి వసూళ్లు, దందాలకు సంబంధించిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. చికెన్ షాపుల నుంచి తోపుడు బండ్ల వ్యాపారుల వరకు వివిధ వర్గాలపై ఒత్తిళ్లు తెస్తున్నారనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
ఈ ఆరోపణలపై అధికార పార్టీ నాయకత్వం స్పందించకపోవడమే ప్రజల్లో అసంతృప్తిని పెంచిందని వైఎస్సార్సీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వ్యవహారశైలిపై సొంత పార్టీ వర్గాల్లోనూ అసంతృప్తి ఉందనే చర్చ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
అనంతపురం మేయర్ ఎన్నికలు
వరుస వివాదాలు.. అయినా అధిష్ఠానం మౌనమేనా?
జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యల వివాదం, వైన్‌షాపు దగ్ధం వెనుక వాటాల వ్యవహారం ఉందనే ఆరోపణలు, ఎగ్జిబిషన్ నిర్వాహకుల నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేశారనే విమర్శలు, భూకబ్జాలు, డబ్బుల వసూళ్ల ఆరోపణలు.. ఇలా అనేక వివాదాలు దగ్గుపాటి చుట్టూ రాజకీయంగా చర్చకు వచ్చాయి.
ఇన్ని వివాదాలు తెరపైకి వచ్చినప్పటికీ పార్టీ అధిష్ఠానం ఎందుకు కఠినంగా స్పందించలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నారా లోకేష్ అండదండలు ఉన్నాయనే ప్రచారంతోనే ఎమ్మెల్యే వ్యవహారశైలిపై పార్టీ నాయకత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందా? అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
అనంతపురం మేయర్ ఎన్నికలు
లోకేష్ అండ ఉన్నా.. ఓటు హక్కు ముందు అంతా సమానమే!
అధికారంలో ఉన్నామనే ధీమా, రాజకీయ అండదండలు, అధికార బలం.. ఇవేవీ ప్రజల అసంతృప్తిని శాశ్వతంగా అణచివేయలేవని అనంతపురం ఎన్నికల ఫలితం రాజకీయ పార్టీలకు మరోసారి గుర్తుచేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక సమస్యలు, నాయకుల వ్యవహారశైలి, ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఫలితం స్పష్టం చేస్తోందని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. మొత్తంగా అనంతపురం మేయర్ పీఠాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం టీడీపీకి రాజకీయ హెచ్చరికగా మారింది. లోకేష్ అండదండలున్నాయనే ప్రచారం మధ్య కూడా ప్రజల తీర్పును మార్చలేకపోయారనే రాజకీయ విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి.
అనంతపురం మేయర్ ఎన్నికలు





