---Advertisement---

పనోరమా హిల్స్ కోసం కొండలు గుండు చేశారా…? మేధావుల మౌనం వెనుక అసలు కారణమేంటి?

విశాఖ పనోరమా హిల్స్‌లో కొండల తొలగింపు వివాద దృశ్యం
---Advertisement---

విశాఖలోని పనోరమా హిల్స్ ప్రాంతం మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. అక్కడ భారీ షాపింగ్ మాల్ ఏర్పాటు కోసం కొండలను గుండు కొట్టారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యవహారంపై సాధారణంగా పెద్ద ఎత్తున స్పందించే మేధావులు, పర్యావరణవాదులు మౌనం పాటించడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

విశాఖ పనోరమా హిల్స్


పనోరమా హిల్స్ వివాదంపై ఎందుకు పెరుగుతున్న ప్రశ్నలు?

పర్యావరణ పరిరక్షణ పేరుతో చిన్నపాటి నిర్మాణాలకే వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే వర్గాలు, ఇప్పుడు మాత్రం ఈ అంశంపై స్పందించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ కోరిక మేరకు పనోరమా హిల్స్ ప్రాంతంలో షాపింగ్ మాల్ ఏర్పాటు జరుగుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కొండలను తవ్వి, ప్రకృతి స్వరూపాన్ని మార్చుతున్నారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక సామాన్య వ్యక్తి కొండ ప్రాంతంలో చిన్న నిర్మాణం చేపట్టినా పర్యావరణ నిబంధనలు గుర్తు చేసే వారు… అధికారానికి దగ్గరగా ఉన్న ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.

“వ్యక్తిని బట్టి పర్యావరణ ప్రేమ మారుతుందా?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ అనుబంధాల ఆధారంగా స్పందనలు మారుతున్నాయా అనే చర్చ కూడా మొదలైంది.

ఇదే సమయంలో, ఈ వ్యవహారంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం “కొండల రక్షణ” అనే అంశం selective ga మారిందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖ పనోరమా హిల్స్


పనోరమా హిల్స్ వివాదం… మౌనం మరిన్ని అనుమానాలకు కారణమా?

పర్యావరణ పరిరక్షణ అనేది వ్యక్తులు, పార్టీలను బట్టి మారే విషయం కాకూడదు. చట్టం అందరికీ ఒకటే అయితే… ప్రకృతి సంరక్షణ విషయంలోనూ ఒకే ప్రమాణం ఉండాలని ప్రజలు కోరుతున్నారు. పనోరమా హిల్స్ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక నిర్మాణ వివాదం కాకుండా… “సెలెక్టివ్ సైలెన్స్” పై పెద్ద చర్చగా మారింది.

విశాఖ పనోరమా హిల్స్

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment