ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార మార్పుతో విధానాలు మారడం సహజమే. కానీ ప్రజల ఆరోగ్యం విషయంలో ఏ ప్రభుత్వం ఏ దిశను ఎంచుకుంది? అన్న ప్రశ్న మాత్రం రాజకీయ నినాదాలతో తేలేది కాదు. దానికి గణాంకాలు, ఫలితాలు, స్వతంత్ర మూల్యాంకనాలే సమాధానం చెప్పాలి.
ఇప్పుడు అలాంటి కీలక ఆధారం ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన Andhra Pradesh Health Systems Strengthening Project Implementation Completion and Results Report (ICR) రూపంలో బయటకొచ్చింది.
2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగ వ్యూహంలో కీలక మార్పు జరిగిందని ప్రపంచ బ్యాంకు నమోదు చేసింది. ప్రైవేట్ రంగ కాంట్రాక్టులపై ఆధారపడటం కంటే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలోనే నాణ్యత పెంచడం, ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత విస్తరించడం వైపు దృష్టి మళ్లించినట్లు నివేదిక స్పష్టం చేసింది.
అక్కడి నుంచే మొదలైంది Zero Vacancy Policy, భారీ నియామకాలు, గ్రామస్థాయిలో వైద్యం, Family Doctor Programme, టెలిమెడిసిన్, డిజిటల్ హెల్త్, NCD స్క్రీనింగ్, ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యతా ప్రమాణాల పెంపు వంటి చర్యల విస్తరణ.
మరి ప్రపంచ బ్యాంకు నమోదు చేసిన ఆ మార్పుల పూర్తి కథ ఏంటి?
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం

జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ప్రైవేట్ కాంట్రాక్టులా? ప్రభుత్వ వైద్య వ్యవస్థా?
ప్రపంచ బ్యాంకు నివేదికలో అత్యంత రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశం ఇదే.
2019లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య రంగ వ్యూహాన్ని సమీక్షించి, ప్రైవేట్ రంగ కాంట్రాక్టులపై ఆధారపడటం కంటే ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సేవల నాణ్యతను పెంచి, వాటి పరిధిని విస్తరించాలని నిర్ణయించినట్లు World Bank పేర్కొంది.
ప్రాజెక్టు లక్ష్యాల సాధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ముఖ్యమంత్రి స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షలు జరిగాయని, ఉన్నత రాజకీయ నాయకత్వం ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చిందని నివేదిక పేర్కొంది.
నిరంతర పర్యవేక్షణ, periodic reviews, సమస్యలను గుర్తించి పరిష్కరించే విధానం వల్ల ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలోనే మెరుగైన మౌలిక సదుపాయాలు సృష్టించగలిగినట్లు World Bank నమోదు చేసింది.
‘జీరో వేకెన్సీ’ పాలసీ.. రెండేళ్లలో దాదాపు 50 వేల నియామకాలు!
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను పరిష్కరించేందుకు “Zero Vacancy Policy” అమలు చేయడం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన చర్యల్లో ఒకటిగా World Bank పేర్కొంది.
సిబ్బంది అవసరాలను rationalise చేయడం, భారీ recruitment drive చేపట్టడం, advertising–hiring processను streamlined చేయడం, పరిపాలనా అడ్డంకులను తొలగించడం వంటి చర్యలు చేపట్టినట్లు నివేదిక తెలిపింది.
ఇంకా:
- Medical Recruitment Board ఏర్పాటు
- Salaries, allowances, incentivesలో మార్పులు
- Promotions, postgraduate seats వంటి retention incentives
- మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు చెల్లింపులు
- అరుదైన, ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వైద్యులను ఆకర్షించేందుకు higher-than-usual remuneration
- underserved areasలో couplesను కూడా నియమించడం
వంటి చర్యలు చేపట్టినట్లు World Bank ICRలో ఉంది.
ఫలితం?
కేవలం రెండేళ్లలో దాదాపు 50,000 మంది healthcare personnelను నియమించినట్లు నివేదిక పేర్కొంది.
అంటే కేవలం ఉద్యోగాల సంఖ్య పెంచడం కాదు. కొత్తగా నిర్మించిన, అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందితో పనిచేసేలా staffingను పునర్వ్యవస్థీకరించినట్లు World Bank వివరించింది.
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం
Medical Recruitment Board నుంచి Mandatory Rural Service వరకు!
Zero Vacancy విధానంలో భాగంగా Medical Recruitment Boardను ఏర్పాటు చేసి recruitment వేగవంతం చేసినట్లు నివేదిక పేర్కొంది.
అంతేకాదు, అన్ని postgraduate medical studentsకు mandatory rural service ప్రవేశపెట్టినట్లు కూడా World Bank ICRలో స్పష్టంగా ఉంది.
ఇక ప్రతి PHC, VHCలో సరిపడా సిబ్బంది ఉండేలా staffingను రూపొందించారు.
ప్రతి PHCకి:
- 2 Medical Officers
- 12 paramedical staff
ప్రతి Village Health Clinicకి:
- Community Health Officer
- ANM
- ASHA workers
ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు నివేదిక పేర్కొంది.
ఇది కేవలం “విలేజ్ క్లినిక్ నిర్మించాం” అనే ప్రచారానికి పరిమితం కాకుండా, ఆ కేంద్రాల్లో ఎవరు పనిచేయాలి, ఎంతమంది ఉండాలి అన్నదానికీ వ్యవస్థ రూపొందించినట్లు చూపిస్తోంది.
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం
ప్రతి PHCకి 12–13 విలేజ్ హెల్త్ సెంటర్లు.. 4,345 కొత్త VHCలు!
ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను గ్రామస్థాయి నుంచే పునర్వ్యవస్థీకరించినట్లు World Bank నమోదు చేసింది.
ప్రతి PHCను 12–13 Village Health Centresతో మ్యాప్ చేశారు.
ప్రతి VHC సుమారు 2,500 నుంచి 4,500 మంది జనాభాకు సేవలు అందించేలా రూపొందించారు. గిరిజన ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా population coverageలో మార్పులు చేసినట్లు నివేదిక పేర్కొంది.
ప్రాజెక్టు కాలంలో:
- 4,345 కొత్త Village Health Centres
- 88 కొత్త PHCs
- 977 rural PHCs renovation
- 184 urban PHCs renovation
- Health & Wellness Centres సంఖ్య 10,086కి రెట్టింపు
అయ్యాయి.
గ్రామంలోనే BP, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్!
ఈ ఆరోగ్య కేంద్రాలను కేవలం చిన్నచిన్న జబ్బులకు పరిమితం చేయలేదు.
హైపర్‌టెన్షన్, డయాబెటిస్, సాధారణ క్యాన్సర్లు, తల్లి–శిశు ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అత్యవసర ప్రసూతి సేవలు వంటి విస్తృత సేవలను అందించేలా సిబ్బంది, పరికరాలను ఏర్పాటు చేసినట్లు World Bank పేర్కొంది.
అంటే ప్రతి ఆరోగ్య అవసరానికీ జిల్లా ఆసుపత్రి వరకు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించి, ప్రాథమిక వైద్యాన్ని ప్రజల ఇంటి దగ్గరికి తీసుకురావడమే లక్ష్యం అన్నమాట.
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం
Family Doctor Programme.. డాక్టర్ కోసం ప్రజలు కాదు, ప్రజల దగ్గరకే డాక్టర్!
జగన్ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రత్యేకంగా నిలిచిన కార్యక్రమాల్లో Family Doctor Programme ఒకటి.
2022 అక్టోబర్‌లో pilotగా ప్రారంభమై, 2023 ఏప్రిల్‌లో అధికారికంగా ప్రారంభమైంది.
డాక్టర్‌తో కూడిన Mobile Medical Unit ప్రతి Village Health Clinicకు నెలకు రెండుసార్లు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వెళ్లేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
అంటే వైద్యం కోసం ప్రజలు డాక్టర్ దగ్గరకు వెళ్లడమే కాదు..
డాక్టరే ప్రజల దగ్గరకు వెళ్లే విధానం.
ఇక్కడే అసలు మార్పు కనిపిస్తుంది.
Family Doctor ఫలితాలు కూడా వచ్చాయా? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ప్రపంచ బ్యాంకు reportలో కేవలం Family Doctor Programme ప్రారంభించారని మాత్రమే కాదు.. దాని outcomesపై evaluation కూడా ప్రస్తావించింది.
అధ్యయనం చేసిన జిల్లాల్లో:
డయాబెటిస్ రోగుల్లో normal blood sugar:
19% నుంచి 63%కి
హైపర్‌టెన్షన్‌లో normal BP control:
36% నుంచి 63%కి
Full antenatal care:
51% నుంచి 71%కి
High-risk pregnancies గుర్తింపు:
11% నుంచి 17%కి
High-risk pregnancies follow-up:
9% నుంచి 52%కి
పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
Evaluation ప్రకారం ఒక్కో consultationకు సుమారు ₹50 salaries, MMU costs కోసం, మరో ₹9 medicines, diagnostics కోసం ఖర్చవుతుందని అంచనా.
అంటే ఈ programme కేవలం launch చేసిన పథకం కాదు.. అధ్యయనం చేసిన ప్రాంతాల్లో కొలిచే స్థాయిలో outcomes కనిపించాయని World Bank report పేర్కొంది.
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం
MMUల్లో 105 మందులు.. 14 డయాగ్నస్టిక్ పరీక్షలు!
Mobile Medical Unitsను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ఏర్పాటు చేశారు.
ప్రతి PHCకి కేటాయించిన MMUలో:
- Essential Drugs List నుంచి 105 మందులు
- 14 basic diagnostic tests
అందుబాటులో ఉండేలా చేశారు.
ప్రతి జిల్లాలో ఒక Reserve MMU కూడా ఏర్పాటు చేశారు.
అవసరమైనప్పుడు సేవలందించేందుకు ప్రతి జిల్లాలో నలుగురు అదనపు వైద్యులను కూడా deploy చేసినట్లు నివేదిక పేర్కొంది.
ప్రతి MMUలో ఒక డాక్టర్‌తో పాటు driver, data-entry operator ఉండేలా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
టెలిమెడిసిన్‌లో ఏపీ దూకుడు.. రోజుకు 75 వేలకుపైగా కన్సల్టేషన్లు!
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో specialist healthcareను అందుబాటులోకి తీసుకురావడానికి భారీ స్థాయిలో telemedicine platformను ఏర్పాటు చేసినట్లు World Bank పేర్కొంది.
ప్రాజెక్టు కాలంలో:
రోజుకు 75,000కుపైగా teleconsultations, prescriptions
అందించినట్లు నివేదిక తెలిపింది.
ఇంకా సంచలన విషయం ఏమిటంటే..
దేశవ్యాప్తంగా నమోదైన teleconsultationsలో దాదాపు మూడో వంతు ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి.
World Bank ప్రకారం పూర్తిస్థాయి సిబ్బందితో 27 eHubs పనిచేశాయి. ప్రతి eHubలో ఇద్దరు Medical Officersతో పాటు General Physician, Gynecologist, Pediatrician వంటి వైద్యులు ఉన్నారు.
అంటే specialist consultationను నగరాలకే పరిమితం చేయకుండా primary-care level వరకూ తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది.
NCD 2.0.. రాష్ట్ర జనాభాలో దాదాపు 80 శాతం స్క్రీనింగ్!
2022–23లో చేపట్టిన NCD 2.0 surveyలో రాష్ట్ర జనాభాలో సుమారు 80 శాతం మందికి screening నిర్వహించినట్లు World Bank పేర్కొంది.
Surveyలో భాగమైన household membersకు unique health identity/ABHA ID రూపొందించినట్లు reportలో ఉంది.
ఈ భారీ screeningలో:
- 10 లక్షలకు పైగా hypertension cases
- దాదాపు 6 లక్షల diabetes cases
- సుమారు 85 లక్షల మంది మహిళలకు breast/cervical cancer symptoms screening
చేసినట్లు reportలో నమోదు చేశారు.
Hypertension, diabetes screening మరియు risk stratificationలో project targetsను కూడా అధిగమించినట్లు World Bank పేర్కొంది.
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం
Digital Health.. 1,042 facilitiesలో Patient Management System!
ఆరోగ్య రంగాన్ని డిజిటల్‌గా మార్చడంపైనా దృష్టి పెట్టారు.
1,042 health facilitiesలో Integrated Patient Management System అమలు చేసి:
- OP
- IP
- Pharmacy
- Laboratory
సేవలను ఒకే digital systemలో అనుసంధానించినట్లు World Bank పేర్కొంది.
Standardised Electronic Medical Recordsను కూడా ప్రవేశపెట్టారు.
Digital health IDs, medical recordsను వేగంగా అమలు చేసిన విధానాన్ని World Bank **“Good Practice”**గా పేర్కొంది.
2022లో ఆంధ్రప్రదేశ్‌కు మూడు National Digital Health Mission Awards కూడా లభించినట్లు report పేర్కొంది.
Digital Quality Dashboard.. వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించే మెకానిజం!
అన్ని health facilitiesలో telecommunication connectivity, digital devices ఏర్పాటు చేసి, కొత్త digital systems, medical technologies వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు నివేదిక తెలిపింది.
అంతేకాదు.. Central Digital Quality Dashboard ద్వారా performance indicatorsను నిరంతరం విశ్లేషించి, లోపాలు కనిపిస్తే corrective measures తీసుకునే విధానం అమలు చేసినట్లు World Bank పేర్కొంది.
అంటే డేటా సేకరించడం మాత్రమే కాదు.. ఆ డేటాతోనే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను monitor చేయడం కూడా జరిగింది.
ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యతకు NQAS.. లక్ష్యం 198, సాధించింది 526!
ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యతను National Quality Assurance Standards ద్వారా పెంచే ప్రయత్నం జరిగింది.
ప్రాజెక్టు లక్ష్యం 198 CHCs, PHCsకు NQAS certification.
కానీ చివరకు:
526 CHCs, PHCs NQAS certification పొందాయి.
అదనంగా District Hospitals, Area Hospitals, Urban PHCs, Health & Wellness Centres కూడా certification పొందినట్లు report పేర్కొంది.
మరింత కీలకమైన విషయం:
2020 నుంచి NQAS-certified public facilities శాతంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అత్యధికంగా ఉందని, తదుపరి స్థానంలో ఉన్న రాష్ట్రంతో పోలిస్తే దాదాపు రెండింతలు ఉందని World Bank తెలిపింది.
ఇది రాజకీయ నాయకుడి మాట కాదు. NQAS certification బాహ్య మూల్యాంకనంతో కూడిన జాతీయ నాణ్యతా ప్రమాణాల ప్రక్రియ.
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం
మందుల కొరతకు చెక్.. Stock-outs 70% తగ్గింపు!
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత, expiry, reordering వంటి సమస్యలను పరిష్కరించేందుకు Smart Pharmaceutical Management System తీసుకొచ్చారు.
Stock monitoring, expiry alerts, automated reordering, అవసరమైన చోటకు medicines redistribution వంటి విధానాలను అమలు చేసినట్లు report పేర్కొంది.
దీని ఫలితంగా:
- Drug stock-outs 70% తగ్గాయి
- Prescription errors 60% తగ్గాయి
- Laboratory turnaround time 24 గంటల నుంచి 4 గంటలకు
- Drug dispensing accuracy 95%
గా నమోదైనట్లు World Bank పేర్కొంది.
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం
14,847 పరికరాలు పనిచేయలేదు.. 12,843కు ఆరు నెలల్లోనే రిపేర్!
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలు ఉండటం మాత్రమే కాదు.. అవి పనిచేయాలి.
మొత్తం 14,847 non-functional medical equipment గుర్తించగా, వాటిలో 12,843 పరికరాలను ఆరు నెలల్లోనే repair చేసినట్లు report పేర్కొంది.
పనికిరాని పరికరాలను decommission చేయడంతో పాటు:
- QR codes
- Maintenance database
- Response deadlines
- Contractual penalties
వంటి విధానాలను కూడా ప్రవేశపెట్టారు.
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం
తల్లి–శిశు ఆరోగ్యంలోనూ మార్పు.. MMR 58 నుంచి 30కి!
World Bank reportలో maternal and infant health indicatorsపైనా కీలక గణాంకాలు ఉన్నాయి.
Maternal Mortality Ratio
2017–19: 58 → 2021–23: 30
Infant Mortality Rate
2018: 29 → 2023: 19
కి తగ్గినట్లు నివేదిక పేర్కొంది. Neonatal mortality కూడా తగ్గినట్లు తెలిపింది.
కోవిడ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా antenatal-care registrations తగ్గినప్పటికీ, 2019తో పోలిస్తే registrations పెరిగిన నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచిందని World Bank పేర్కొంది.
దీనికి extensive outreach, communication efforts సహకరించినట్లు report తెలిపింది.
కోవిడ్ సమయంలో అసలు పరీక్ష.. 10 వేల Oxygen Concentrators నుంచి 100+ Labs వరకు!
COVID-19 సమయంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థకు భారీ పరీక్ష ఎదురైంది.
ఆ సమయంలో:
- 10,000 Oxygen Concentrators
- Ventilators
- PPE
- Infection-control materials
- Dedicated COVID wards
- Oxygen-supported beds
- Critical-care units
అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నివేదిక పేర్కొంది.
COVID testing capacityను 100కుపైగా laboratoriesకు విస్తరించారు.
Remote areas కోసం mobile testing unitsను కూడా వినియోగించారు.
Rural, marginalised communitiesపై ప్రత్యేక దృష్టి పెట్టి timely treatment, vaccination అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు World Bank తెలిపింది.
2023 మార్చి నాటికి 4.3 కోట్లకు పైగా vaccine doses, adult vaccination coverage 90 శాతానికి పైగా నమోదైనట్లు project report పేర్కొంది.
చివరికి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చారా? ఇదే అసలు పరీక్ష!
భవనాలు నిర్మించడం ఒక విషయం.
సిబ్బందిని నియమించడం మరో విషయం.
Software, equipment ఏర్పాటు చేయడం ఇంకో విషయం.
కానీ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించారా? అన్నదే అసలు పరీక్ష.
ఈ విషయంలోనూ World Bank report కీలకంగా స్పందించింది.
ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ వినియోగం గణనీయంగా పెరిగిందని, ముఖ్యంగా PHC utilisation పెరిగిందని పేర్కొంది.
World Bank field mission సందర్శించిన కొన్ని facilities well-run, well-functioning, well-usedగా ఉన్నట్లు reportలో నమోదు చేసింది.
కొత్త primary-care facilities, mobile health services, telemedicine, recruitment reforms ద్వారా గతంలో underserved householdsకు, ముఖ్యంగా tribal areasలోని ప్రజలకు ఆరోగ్య సేవలు చేరువయ్యాయని, equitable access, quality, responsivenessలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది.
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం
మరి World Bank ఇచ్చిన తుది తీర్పు ఏంటి?
ఇక్కడే మొత్తం కథలో అసలు క్లైమాక్స్.
Andhra Pradesh Health Systems Strengthening Projectపై World Bank తుది అంచనాలో:
- High Relevance
- Substantial Efficacy
- Substantial Efficiency
గా పేర్కొంది.
మొత్తం project outcomeకు:
“SATISFACTORY”
అనే rating ఇచ్చింది.
అంటే ఇది జగన్ ప్రభుత్వం తనకు తానే ఇచ్చుకున్న certificate కాదు.
ప్రాజెక్టును సమీక్షించిన World Bank final assessmentలో నమోదైన rating.
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం
మరి ఇప్పుడు అసలు రాజకీయ ప్రశ్న ఇదే.. ప్రభుత్వ వైద్యమా? ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ా?
ఈ reportను కేవలం health statisticsగా చూస్తే సగం కథ మాత్రమే కనిపిస్తుంది.
ఎందుకంటే World Bank స్వయంగా policy directionలో మార్పును నమోదు చేసింది.
2019లో వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలోనే quality, access పెంచాలని నిర్ణయించింది.
అదే సమయంలో 2024 మధ్యలో తిరిగి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కొత్త medical colleges, urban PHCs వంటి సంస్థల నిర్వహణలో private-sector outsourcingపై మరింత ఆధారపడటం ప్రారంభించిందని World Bank report పేర్కొంది.
ఇక్కడే రాజకీయంగా అసలు పోరు మొదలవుతోంది.
ఒక విధానం:
ప్రభుత్వ డాక్టర్లు.. ప్రభుత్వ ఆసుపత్రులు.. ప్రభుత్వ PHCs.. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు.. ప్రభుత్వ digital infrastructure.. ప్రభుత్వ health outreach.
మరో విధానం:
ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో private-sector outsourcingను పెంచడం.
ప్రపంచ బ్యాంకు report ఈ రెండు policy approaches మధ్య ఉన్న తేడాను రికార్డు చేసింది.
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం
జగన్‌కు రాజకీయ సర్టిఫికేటా? కాదు.. World Bank రికార్డు చేసిన ఫలితాలా?
వైఎస్ జగన్ హయాంలో ఆరోగ్య రంగంపై రాజకీయంగా ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా.. ఇప్పుడు ఒక విషయం మాత్రం అధికారిక రికార్డులో ఉంది.
Zero Vacancy Policy.. Medical Recruitment Board.. Mandatory Rural Service..
రెండేళ్లలో దాదాపు 50,000 healthcare personnel నియామకాలు..
ప్రతి PHCకి 2 Medical Officers + 12 paramedical staff..
ప్రతి VHCలో CHO + ANM + ASHA workers..
4,345 కొత్త Village Health Centres.. 88 కొత్త PHCs.. 977 rural PHCs, 184 urban PHCs renovation..
Health & Wellness Centres సంఖ్య 10,086కి రెట్టింపు..
Family Doctor Programme.. నెలకు రెండుసార్లు గ్రామాలకు వైద్య సేవలు..
ప్రతి PHCకి 105 essential medicinesతో MMUs.. 14 basic diagnostic tests..
రోజుకు 75,000కుపైగా teleconsultations.. దేశవ్యాప్తంగా దాదాపు మూడో వంతు teleconsultations AP నుంచే..
NCD 2.0లో దాదాపు 80% population screening.. ABHA IDs..
10 లక్షలకు పైగా hypertension cases.. దాదాపు 6 లక్షల diabetes cases.. 85 లక్షల మహిళలకు cancer screening..
1,042 facilitiesలో Integrated Patient Management System.. Digital Healthకు “Good Practice” గుర్తింపు.. మూడు National Digital Health Mission awards..
NQAS certificationలో 198 లక్ష్యానికి బదులుగా 526 CHCs, PHCs..
Drug stock-outs 70% తగ్గింపు.. prescription errors 60% తగ్గింపు.. lab turnaround 24 గంటల నుంచి 4 గంటలకు.. drug dispensingలో 95% accuracy..
14,847 non-functional equipmentలో 12,843 repair..
MMR 58 నుంచి 30కి.. IMR 29 నుంచి 19కి..
COVID సమయంలో 10,000 oxygen concentrators.. 100కుపైగా testing laboratories.. 4.3 కోట్లకు పైగా vaccine doses..
ఇవన్నీ World Bank project completion documentationలో నమోదైన అంశాలు.
అందుకే ఇప్పుడు ప్రశ్నను మరోసారి అడగాల్సిందే:
“జగన్ ఏం చేశాడు?”
అనే ప్రశ్నతో పాటు..
“ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసిన ఈ మోడల్ కొనసాగాలా? లేక ప్రభుత్వ వైద్య సంస్థల్లో ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్‌ను పెంచాలా?”
అన్నది కూడా చర్చకు రావాలి.
ఎందుకంటే ఈసారి జగన్ ప్రభుత్వ పనితీరుపై మాట్లాడుతున్నది ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు.
ప్రపంచ బ్యాంకు తన అధికారిక ICRలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థలో జరిగిన మార్పులను నమోదు చేసింది.
మరియు తుది అంచనా?
High Relevance. Substantial Efficacy. Substantial Efficiency. Overall — “Satisfactory”.
రాజకీయ ప్రభుత్వాలు మారొచ్చు. విధానాలు మారొచ్చు. కానీ World Bank రికార్డులోకి వెళ్లిన ఈ గణాంకాలు మాత్రం ఏపీ ఆరోగ్య రంగంపై జరిగే రాజకీయ చర్చలో ఇక అంత తేలిగ్గా పక్కన పెట్టలేని ఆధారంగా మిగిలిపోయాయి.
రాజకీయ ప్రభుత్వాలు మారొచ్చు. విధానాలు మారొచ్చు. కానీ World Bank రికార్డులోకి వెళ్లిన ఈ గణాంకాలు మాత్రం ఏపీ ఆరోగ్య రంగంపై జరిగే రాజకీయ చర్చలో ఇక అంత తేలిగ్గా పక్కన పెట్టలేని ఆధారంగా మిగిలిపోయాయి.
Source:
గమనిక: ఈ కథనంలోని ఆరోగ్య రంగానికి సంబంధించిన గణాంకాలు, ప్రాజెక్టు వివరాలు World Bank అధికారిక Implementation Completion and Results Report ఆధారంగా అందించబడ్డాయి.
జగన్ హయాంలో ఏపీ ఆరోగ్య రంగం





