---Advertisement---

ఒక అబద్ధానికి రెక్కలు కట్టిన వ్యవస్థ: నిన్న సాయంత్రం మొదలైన దుష్ప్రచార యంత్రాంగం వెనుక అసలు నిజం ఏమిటి?

Summarize with AI

---Advertisement---

వైయస్సార్సీపీపై నిన్న సాయంత్రం నుంచి యెల్లో మీడియా సాటిలైట్ ఛానెల్స్, యూట్యూబ్ వేదికలు, అలాగే అధికార పార్టీకి అనుకూలమైన సోషల్ మీడియా అకౌంట్స్ మరియు కూలీ ఫేక్ అకౌంట్స్ ద్వారా ఒకే దిశలో విస్తృతమైన దుష్ప్రచారం సాగుతోంది.


ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్దేశించి రోజా గారు చేసిన వ్యాఖ్యలను కావాలనే మొదట్లో కట్ చేసి, మిగిలిన వీడియో భాగాన్ని వైయస్సార్సీపీ ప్రభుత్వమే లడ్డూల్లో కల్తీ చేసిందన్నట్టుగా అర్థం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం ఈ దుష్ప్రచారానికి స్పష్టమైన ఉదాహరణ.


ఒక అబద్ధాన్ని నిజంగా మలచేందుకు సమన్వయంతో పనిచేసే ఈ ఎకోసిస్టమ్, ప్రజాభిప్రాయాన్ని మభ్యపెట్టే ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా, ఇలాంటి అబద్ధాల ప్రచారంలో కొందరు జర్నలిస్టులు పోషిస్తున్న పాత్రపై సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జర్నలిజం అనేది కేవలం ఉపాధి మాత్రమే కాదు—అది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక కీలక సామాజిక బాధ్యత.

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment