---Advertisement---

పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఏమైంది?

పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు అంటూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు భరోసాపై రాజకీయ విమర్శలు చూపిస్తున్న ఫీచర్డ్ ఇమేజ్
---Advertisement---

పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు

ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా అందరికీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఒక్క కుటుంబంలో ఇద్దరికి మాత్రమే పరిమితం చేశారు.

జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు లెక్కిస్తే ఒక్క మహిళకు రూ.18 వేల రావాలి. రెండేళ్లకు అది రూ.36 వేల అవుతుంది. ప్రతి ఇంట్లో ముగ్గురు మహిళలు ఉన్నారని లెక్కిస్తే ఒక్క ఇంటికే రూ.72 వేల బాకీ పడుతుంది.

అలాగే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఏడాదికి రూ.36 వేల చొప్పున రెండేళ్లకు రూ.72 వేల బాకీ అవుతుంది. ఇప్పటికైనా ఈ బాకీలు ఎప్పుడు చెల్లిస్తారనే ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది.

పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు


50 ఏళ్ల పెన్షన్ ఏది?

50 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని జనవరి 2024 నుంచి హామీ ఇచ్చారు.

నెలకు రూ.4 వేల చొప్పున ఇప్పటి వరకు రూ.48 వేల రావాలి. రెండేళ్లకు అది రూ.96 వేల బాకీ అవుతుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన అమలు చేయలేదు. గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఈ అంశంపై చర్చ జరుగుతోంది.

పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు


రైతుల నడ్డి విరిచారు

రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఇస్తున్న నగదును కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాల్లో కలిపి చూపుతోందని ఆరోపణలు ఉన్నాయి.

రెండేళ్లు పూర్తయ్యాయి. మూడో ఏడాది నడుస్తోంది. రైతులకు కలిపి రూ.40 వేల వరకు ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు రూ.14 వేల, రూ.26 వేల మధ్య గ్యాప్ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

50 లక్షల మంది రైతులకు రూ.40 వేల చొప్పున ఇస్తామని చెప్పినా పూర్తి స్థాయిలో అమలు కాలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా నగదును కూడా రాష్ట్ర పథకంగా ప్రచారం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

“కేంద్రం ఇచ్చే డబ్బును కూడా తమదిగా చూపించుకోవడం సరైంది కాదు” అని రైతులు అంటున్నారు. ఉచిత బస్సుల మాదిరిగానే రైతు భరోసా విషయంలో కూడా హామీలు నిలబెట్టుకోలేదని విమర్శిస్తున్నారు.

పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు


ఉచిత బస్సు.. తుస్సు

రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. 16 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందని చెప్పారు.

అయితే ఇప్పటి వరకు కేవలం 5 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే కొన్ని చోట్ల అమలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు కాలేదు.

ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతుండగా, అక్కడ ప్రతి రోజు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో 52 వేల బస్సులు అందుబాటులో ఉన్నా కూడా పూర్తి అమలు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా రూ.12 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం చెబుతున్నా, ప్రజలు మాత్రం హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు


తల్లికొడుకులిద్దరికీ వ్యాపారమే.. ప్రజలదే నష్టం

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద ఈ రెండేళ్లలో భారీగా బకాయిలు పేరుకుపోయాయి.

2024 జనవరి నుంచి ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.5,820 కోట్లు బకాయిగా ఉన్నాయని చెబుతున్నారు. వసతి దీవెన కింద మరో రూ.6,300 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం.

ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు రూ.700 కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తం రూ.1,770 కోట్లు, వసతి దీవెన కింద రూ.900 కోట్లు ఇంకా విడుదల కాలేదని చెబుతున్నారు.

మొత్తంగా రూ.2,670 కోట్ల నుంచి రూ.3,628 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

2025, 2026 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. 2025లో రూ.1,100 కోట్లు, 2026లో మరో రూ.1,100 కోట్లు బకాయిలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పేరుతో వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులపై మోపారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు


అమ్మ ఒడి మరో మోసం

ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. చిక్కిరి లేకుండా 20 లక్షల మంది పిల్లలకు అందిస్తామని హామీ ఇచ్చారు.

రూ.15 వేల బదులు తక్కువ మొత్తాలు మాత్రమే అందుతున్నాయని తల్లులు చెబుతున్నారు. కొందరికి రూ.9 వేల, మరికొందరికి రూ.8 వేల, ఇంకొందరికి రూ.10 వేల మాత్రమే వచ్చాయని ఆరోపిస్తున్నారు.

ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నా ఒక్కరికే పరిమితం చేయడం వల్ల అనేక కుటుంబాలు నష్టపోయాయని చెబుతున్నారు.

పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు


గ్యాస్ కూడా లేదు

గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అంశంలో కూడా ఎన్నికల హామీలు అమలు కాలేదని ప్రజలు అంటున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు.

కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కోట్లాది కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పినా ప్రజలకు స్పష్టమైన ప్రయోజనం అందలేదని విమర్శలు ఉన్నాయి.

కొన్ని చోట్ల రూ.50 నుంచి రూ.90 వరకు మాత్రమే తగ్గింపు కనిపిస్తోందని, అది కూడా అందరికీ అందడం లేదని ప్రజలు చెబుతున్నారు.

పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు


కోత పెన్షన్లు లేవు.. ప్రతి నెలా 25 వేల కట్

మొదట రాష్ట్రంలో మొత్తం 66,34,372 మంది పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది.

అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 60,11,293కు తగ్గిందని చెబుతున్నారు. అంటే 6,23,079 మంది పెన్షన్లు కోల్పోయినట్టే అని విమర్శలు ఉన్నాయి.

ప్రతి నెలా సుమారు 25 వేల పెన్షన్లు కట్ చేస్తున్నారని గ్రామాల్లో చర్చ జరుగుతోంది. అర్హులైన వృద్ధులు, వికలాంగులు, విధవలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment