---Advertisement---

కుప్పంలో గంగమ్మ జాతర దందా..? అన్నదానం డబ్బు టీడీపీ ఖాతాల్లోకి!

కుప్పం గంగమ్మ జాతర విరాళాలు టీడీపీ అనుబంధ ఖాతాలకు మళ్లింపుపై వివాదం
---Advertisement---

కుప్పం గంగమ్మ జాతరలో ఇప్పుడు విరాళాల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంగమ్మ తల్లి అన్నదానం పేరుతో భక్తుల నుంచి సేకరిస్తున్న డబ్బులు దేవస్థానం అధికారిక ఖాతాలకు కాకుండా “కుప్పం మన అన్న క్యాంటీన్” పేరిట ఉన్న యూపీఐ ఖాతాలోకి వెళ్తున్నాయన్న ఆరోపణలు సంచలనంగా మారాయి.

భక్తి పేరుతో విరాళాలు సేకరించి, వాటిని రాజకీయ అనుబంధం ఉన్న ఖాతాలకు మళ్లిస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు.

గంగమ్మ జాతర దందా


అన్నదానం చందా పేరుతో వసూళ్లు

జాతర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో “అన్నదానం చందా” పేరుతో విరాళాలు ఇవ్వాలని భక్తులను కోరుతున్నారు. అయితే అక్కడ ప్రదర్శించిన QR కోడ్ స్కాన్ చేస్తే “KUPPAM MANA ANNA CANTEEN” పేరిట ఖాతా కనిపిస్తోందని భక్తులు చెబుతున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోన్‌పే చెల్లింపుల స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భక్తులు గంగమ్మ తల్లికి విరాళం ఇస్తున్నామనుకుంటే, ఆ డబ్బు క్యాంటీన్ ఖాతాలోకి ఎందుకు వెళ్తోందని ప్రశ్నిస్తున్నారు. గంగమ్మ జాతర దందా


టీడీపీ నేతల అండతోనే వ్యవహారమా..?

స్థానికంగా టీడీపీ నేతల అండతో ఈ వ్యవహారం నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడి ఛైర్మన్ రవిచంద్రబాబు ఏర్పాటు చేసిన “మన అన్న క్యాంటీన్” ఖాతాకు గంగమ్మ జాతర విరాళాలు జమవుతున్నాయన్న ప్రచారం కుప్పంలో పెద్ద చర్చకు దారితీసింది.

దేవస్థానం పేరుతో సేకరించిన నిధులు అధికారిక ఆలయ ఖాతాలకు కాకుండా ప్రైవేట్ సంస్థల ఖాతాల్లోకి ఎందుకు వెళ్తున్నాయన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి.

గంగమ్మ జాతర దందా


భక్తుల ఆగ్రహం

జాతర సమయంలో వ్యాపారులు, చిన్న దుకాణదారులు, స్థానికుల వద్ద నుంచి బలవంతంగా చందాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. “అన్నదానం కోసం” అంటూ ఒత్తిడి తెచ్చి డబ్బులు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

భక్తుల విశ్వాసాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రచారం, ఇమేజ్ బిల్డింగ్ కోసం డబ్బులు వాడుతున్నారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


పూర్తి లెక్కలు బయటపెట్టాలన్న డిమాండ్

గంగమ్మ జాతర పేరుతో ఎంత మొత్తం వసూలు చేశారు..? ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేశారు..? దేవస్థానం అధికారిక అనుమతి ఉందా..? అన్న అంశాలపై పూర్తి వివరాలు ప్రజల ముందుంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

అలాగే QR కోడ్ ద్వారా వచ్చిన మొత్తాలపై పారదర్శకత పాటించాలని కోరుతున్నారు.


భక్తుల నమ్మకంపై పెరుగుతున్న అనుమానాలు

భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలవాల్సిన గంగమ్మ జాతర ఇప్పుడు రాజకీయ ఆరోపణల కేంద్రంగా మారడం కుప్పంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. భక్తుల నుంచి వచ్చిన విరాళాలు నిజంగా దేవస్థానం అవసరాలకే వినియోగిస్తున్నారా..? లేక రాజకీయ అనుబంధ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారా..? అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు అంటున్నారు.

గంగమ్మ జాతర దందా

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment