రాష్ట్రంలో ఏ వస్తువు కొరత వచ్చినా… సమస్యను పరిష్కరించడంపై కాకుండా, దానిపై కొత్త కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
యూరియా కొరత వచ్చినప్పుడు…
“యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది” అంటూ ప్రజల్లో భయాలు సృష్టించిన ఉదాహరణ ఇంకా కొత్తగానే ఉంది.
ఇప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా ఇదే పాత పద్ధతి మళ్లీ కనిపిస్తోంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్యాస్ వాడితే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని…
పెట్రోల్, డీజిల్ ఎక్కువగా వాడితే పొల్యూషన్ పెరుగుతుందని…
ఇలా అసలు సమస్య — కొరత, ధరలు, సరఫరా లోపాలు — ఇవన్నీ పక్కనపెట్టి
కొత్త కథలతో దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సమస్యలకు పరిష్కారమా… లేక కథలతో మేనేజ్‌మెంటా?
ప్రజలకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వ బాధ్యత…
కానీ కొరతలను కప్పిపుచ్చేందుకు కథలు చెప్పడం పాలనగా మారితే… అసలు సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదనే విమర్శలు బలపడుతున్నాయి.






