ఓటర్ల డేటా ప్రకారం మహిళల సంఖ్య
భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓటర్ల డేటా సారాంశం ప్రకారం రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి.
| నియోజకవర్గాల రకం | GEN | SC | ST | మొత్తం |
|---|---|---|---|---|
| నియోజకవర్గాల సంఖ్య | 139 | 29 | 7 | 175 |
ఓటర్ల వివరాలు (సర్వీస్ ఓటర్లతో సహా)
| వర్గం | GEN | SC | ST | మొత్తం |
|---|---|---|---|---|
| పురుషులు | 1,64,02,655 | 31,52,459 | 7,84,737 | 2,03,39,851 |
| మహిళలు | 1,69,81,738 | 32,41,035 | 8,35,842 | 2,10,58,615 |
| తృతీయ లింగం | 2,997 | 315 | 109 | 3,421 |
| మొత్తం | 3,33,87,390 | 63,93,809 | 16,20,688 | 4,14,01,887 |
మూలం – భారత ఎన్నికల సంఘం

ఆడబిడ్డ నిధికి అర్హులైన మహిళల వివరాలు
- రాష్ట్రంలో మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య – 2,10,58,615
- అందులో 60 సంవత్సరాల పైబడిన మహిళల శాతం – సుమారు 15%
అర్హత వయస్సు గల మహిళలు
18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల అంచనా సంఖ్య:
1,78,99,440
అంటే రాష్ట్రంలో సుమారు 1.78 కోట్ల మహిళలు ఆడబిడ్డ నిధికి అర్హులు అయ్యే అవకాశం ఉంది.
లబ్ధిదారులు మాత్రం సున్నా
అయితే ఈ లెక్కల ప్రకారం కోట్ల సంఖ్యలో మహిళలు అర్హులు ఉన్నప్పటికీ,
ఆడబిడ్డ నిధి కింద ఇప్పటివరకు లబ్ధి పొందుతున్న మహిళల సంఖ్య – సున్నా.
ఈ పరిస్థితి పథకం అమలు స్థితి పై ప్రశ్నలు రేపుతోంది.





