“కల్తీ లేదని ఎక్కడ ఉంది?” అంటూ జర్నలిస్ట్‌పై సీఎం చంద్రబాబు మండిపాటు
ఈ రోజు జరిగిన జర్నలిస్ట్ సమావేశంలో, సీబీఐ సిట్ రిపోర్ట్‌లో తిరుమల లడ్డులో జంతు కొవ్వు లేదని స్పష్టంగా ఉందని ఒక పత్రికా విలేఖరి ప్రశ్నించారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “కల్తీ లేదని ఎక్కడ ఉంది? నీకు రాత్రి కల వచ్చిందా? లేక నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా?” అంటూ జర్నలిస్ట్‌ను నిలదీశారు.
నిజం ఏంటంటే… సీబీఐ సిట్ రిపోర్ట్‌లో , ల్యాబ్ రిపోర్ట్ ఎన్ డీఆర్ఐ , ఎన్ డీడీబి లో జంతు కొవ్వు లేదని స్పష్టమైన నమోదు
ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ, వాస్తవంగా సీబీఐ సిట్ రిపోర్ట్‌లో, ల్యాబ్ రిపోర్ట్ ఎన్ డీఆర్ఐ , ఎన్ డీడీబి తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు లేదని స్పష్టంగా పేర్కొనబడింది. ఈ అంశం అధికారిక నివేదికలో ఉండగానే, దానిపై ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై ఈ స్థాయి ప్రతిస్పందన రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది







