---Advertisement---

🔴తిరుమల లడ్డూ పేరుతో రాజకీయ దుమారం! సీబీఐ చార్జ్‌షీట్‌ను తిప్పి వక్రీకరించి చదివిన నారా లోకేశ్!

---Advertisement---

చార్జ్‌షీట్‌లోని “పేజీ 35” నిజం కాదు?
ఆ ఒక్క పేజీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమా?

సీబీఐ చార్జ్‌షీట్‌లోని 35వ పేజీని చూపిస్తూ తిరుమల లడ్డూల్లో జంతు కొవ్వు వాడారంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. కానీ ఆ పేజీ నిజంగా ఏమి చెబుతోంది? అది తుది నిర్ణయమా? లేక దర్యాప్తు ఎందుకు మొదలైందన్న నేపథ్య వివరణ మాత్రమేనా? చార్జ్‌షీట్ నిర్మాణం తెలిసినవారికి ఇది స్పష్టమైన విషయమే అయినా, ప్రజల్లో మాత్రం భారీ గందరగోళం సృష్టించబడింది.


🔥 ఆరోపణల సారాంశాన్ని తీర్పుగా చూపించారా?

పేజీ 35 అనేది “Brief Facts” విభాగానికి చెందినది. జూలై 2024లో నమోదైన ఫిర్యాదులు, అప్పటి అనుమానాలు, రాజకీయ ఆరోపణల సారాంశమే అక్కడ ఉంది. విచారణ పూర్తయ్యాక వచ్చిన శాస్త్రీయ నిర్ధారణలు ఇందులో లేవు. అయినా, ఈ పేజీని తుది ఆధారంలా చూపించి జంతు కొవ్వు వాడారని ప్రకటించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

🔥 ఫోరెన్సిక్ నిజాలు పక్కనపెట్టారా?

సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం తుది నివేదిక మాత్రం పూర్తిగా వేరే కథ చెబుతోంది. చార్జ్‌షీట్‌లోని 209 నుంచి 211 పేజీల్లో స్పష్టంగా — లడ్డూల్లో గానీ, సరఫరా నెయ్యిలో గానీ జంతు కొవ్వు గుర్తించలేదని ఫోరెన్సిక్ సంస్థలు తేల్చాయి. జాతీయ డైరీ పరిశోధనా సంస్థ, డైరీ అభివృద్ధి మండలి నివేదికలు “Animal Fat Theory”ను పూర్తిగా ఖండించాయి.

🔥 లడ్డూలే పరీక్షించారా? అసలు ట్విస్ట్ ఇదే!

ఈ వివాదంలో మరో కీలక నిజం బయటపడింది. సీబీఐ పరీక్షలు జరిపింది లడ్డూలపై కాదు. లడ్డూలుగా మారే ముందు పట్టుబడిన నెయ్యి ట్యాంకర్ల నుంచే నమూనాలు సేకరించారు. అంటే “లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు” అన్న ప్రచారం పూర్తిగా ఊహాగానాలపై ఆధారపడిందన్న మాట.


రాజకీయ ఆరోపణలు ఎంత గట్టిగానున్నా… సీబీఐ నివేదికలో బయటపడినది నిజం!

తిరుమల లడ్డూ అంశం భక్తుల విశ్వాసంతో ముడిపడిన సున్నితమైన విషయం. అలాంటి అంశంలో రాజకీయ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? సీబీఐ తుది నివేదిక మాత్రం స్పష్టంగా ఒకటే చెబుతోంది — జంతు కొవ్వు వాడారన్నది ఆరోపణలు మాత్రమే శాస్త్రీయ ఆధారాలు లేవు. రాజకీయ ఆరోపణలు ఎంత హోరెత్తినా… చార్జ్‌షీట్‌లో మాత్రం నిజాలు దాచలేకపోయారు!

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment