---Advertisement---

నామినేషన్ల వద్దే రాజకీయ అడ్డంకులా? ఆర్వో వ్యాఖ్యలతో మోపాడులో మంటలు!

మోపాడు నామినేషన్ల వివాదం – నాలుగు సర్పంచ్, ఆరు వార్డు నామినేషన్ల తిరస్కరణపై నిరసన

Summarize with AI

---Advertisement---

మోపాడు నామినేషన్ల వివాదం

నాలుగు సర్పంచ్, ఆరు వార్డు నామినేషన్లు తిరస్కరణ.. అధికారుల తీరుపై అభ్యర్థులు, గ్రామస్తుల ఆగ్రహం

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మోపాడు పంచాయతీలో నామినేషన్ల పరిశీలన వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణపై అభ్యర్థులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల పరిశీలనలో నిబంధనల పేరుతో అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందంటూ ఆందోళనకారులు నిరసనకు దిగారు.

మోపాడు నామినేషన్ల వివాదం

మోపాడు నామినేషన్ల వివాదం

“నాపై ఒత్తిడుంది.. అర్థం చేసుకుని వెళ్లిపోండి..” అంటూ ఆర్వో వ్యాఖ్యలు చేసినట్లు అభ్యర్థులు ఆరోపించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన నాలుగు నామినేషన్లు, ఆరు వార్డు సభ్యుల నామినేషన్లను తిరస్కరించడంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్న చిన్న కారణాలు చూపుతూ నామినేషన్లను తిరస్కరించారని, అక్షరాలకు కొమ్ములు ఇవ్వలేదని, తప్పులు ఉన్నాయని పేర్కొంటూ నామినేషన్లను పక్కన పెట్టారని అభ్యర్థులు ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఎన్నికల అధికారుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.

నామినేషన్ల తిరస్కరణపై నిరసన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు, మహిళలు, అభ్యర్థులు నామినేషన్ కేంద్రం ఎదుట కందుకూరు–గుడ్డూరు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

తమ నామినేషన్లను తిరస్కరించిన ఆర్వోపై చర్యలు తీసుకోవాలని, అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్న ఆర్వోను సస్పెండ్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా చేస్తున్న అభ్యర్థులను, గ్రామస్తులను అక్కడి నుంచి తొలగించారు.

మోపాడు నామినేషన్ల వివాదం

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment