---Advertisement---

బీసీ రిజర్వేషన్లపై మాటల మాయేనా? చంద్రబాబు సర్కార్‌పై జగన్‌ తీవ్ర ప్రశ్నలు

బీసీ 34 శాతం రిజర్వేషన్లపై జగన్‌ ప్రశ్నలు

Summarize with AI

---Advertisement---

బీసీ 34 శాతం రిజర్వేషన్లు

డెస్క్: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. చట్టపరమైన రక్షణ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. నిజంగా 34 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాజ్యాంగబద్ధమైన మార్గాన్ని చూపించాలని డిమాండ్ చేశారు.

బీసీ 34 శాతం రిజర్వేషన్లు


“34 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఎక్కడ?”

చంద్రబాబును ఉద్దేశించి జగన్‌ చేసిన వ్యాఖ్యల్లో బీసీ రిజర్వేషన్ల అంశమే ప్రధానంగా నిలిచింది. “34 శాతం రిజర్వేషన్లు అంటూ ఎంతకాలం బీసీలను మభ్యపెడతారు?” అంటూ ఆయన ప్రశ్నించారు. కోర్టుల్లో నిలబడే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కేవలం జీవోలు జారీ చేయడం వల్ల బీసీలకు శాశ్వత ప్రయోజనం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరిపారో కూడా చంద్రబాబు వెల్లడించాలని డిమాండ్ చేశారు. YSR Congress Party

జగన్‌ ఆరోపణల ప్రకారం, 34 శాతం రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి చట్టపరమైన మార్గాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఈ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.

బీసీ 34 శాతం రిజర్వేషన్లు


139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు

తమ ప్రభుత్వ హయాంలో బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కోసం పలు చర్యలు చేపట్టామని జగన్‌ పేర్కొన్నారు. 139 బీసీ కులాలను కవర్‌ చేస్తూ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు ఆయన వివరించారు.

బీసీ 34 శాతం రిజర్వేషన్లు


రాజ్యసభ నుంచి స్థానిక సంస్థల వరకు బీసీలకు ప్రాతినిధ్యం

జగన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 11 రాజ్యసభ స్థానాల్లో నాలుగు స్థానాలను బీసీలకు అవకాశం కల్పించామని, 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చామని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల్లోనూ బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. 13 జడ్పీ చైర్‌పర్సన్‌ పదవుల్లో ఆరు, 13 మేయర్‌ పదవుల్లో తొమ్మిది, 84 మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవుల్లో 44 బీసీలకు దక్కాయని పేర్కొన్నారు.

బీసీ 34 శాతం రిజర్వేషన్లు


సంక్షేమ పథకాల ద్వారా రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం: జగన్‌

అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, రైతుభరోసా, పెన్షన్‌ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు తదితర పథకాల ద్వారా బీసీ కుటుంబాలు లబ్ధి పొందాయని జగన్‌ చెప్పారు.

వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు మొత్తం రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం అందించామని ఆయన పేర్కొన్నారు.

బీసీ 34 శాతం రిజర్వేషన్లు


“కేంద్రాన్ని ఒప్పించి చట్ట సవరణ తీసుకురండి”

34 శాతం బీసీ రిజర్వేషన్లపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేవలం రాష్ట్రస్థాయిలో జీవోలు జారీ చేయడం కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చట్ట సవరణ ద్వారా రాజ్యాంగబద్ధమైన పరిష్కారం తీసుకురావాలని జగన్‌ డిమాండ్ చేశారు. ఢిల్లీ పర్యటనల్లో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లారో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు.

బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటిపై కోర్టు పరిణామాలు ఇప్పుడు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. తాజాగా హైకోర్టు సంబంధిత జీవోలను కొట్టివేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య విమర్శలు మరింత ముదిరాయి.

బీసీ 34 శాతం రిజర్వేషన్లు

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment