రాయలసీమ లిఫ్ట్ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఛలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడులో నిర్వహించిన బహిరంగ సభకు సజ్జల రామకృష్ణారెడ్డి సహా వైసీపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో నేతలు, రైతులు తరలివచ్చి లిఫ్ట్ ప్రాజెక్టు కోసం తమ పోరాటాన్ని ఉధృతం చేశారు.
రాయలసీమకు న్యాయం చేయాలనే నినాదంతో వైసీపీ పోరుబాట రాజకీయంగా కీలక మలుపు తీసుకుంటోంది.







