తత్వం మూవీ
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘తత్వం’ విడుదలకు సిద్ధమైంది. అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె జంటగా నటించిన ఈ చిత్రంపై హీరో దినేష్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌ను ప్రేక్షకులు ఎవరూ ముందుగా ఊహించలేరని, చివర్లో వచ్చే ఎమోషన్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని ఆయన తెలిపారు. మూఢనమ్మకం–నమ్మకం మధ్య సాగే ఈ కథ 2000 సంవత్సరంలో నేపథ్యంలో తెరకెక్కిందని చెప్పారు. సినిమా ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, యాక్సిడెంట్ నుంచి బయటపడటం, తన పాత్రపై ఉన్న నమ్మకం గురించి కూడా దినేష్ తేజ్ మాట్లాడారు.
తత్వం మూవీ

‘తత్వం’పై దినేష్ తేజ్ ధీమా.. క్లైమాక్స్ విషయంలో మాత్రం భారీ ట్విస్ట్!
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న హీరో దినేష్ తేజ్ మరో ఆసక్తికరమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘తత్వం’ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. అర్జున్ కోలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దష్విక.కె కథానాయికగా నటించారు.
త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె. ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శీమకుర్తి వంశీకృష్ణ, శ్వేత పసుపులేటి నిర్మించారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
తత్వం మూవీ
ఎందుకు ‘తత్వం’ చేశారంటే..
ఈ కథలో ఎవరూ ముందుగా ఊహించలేని ట్విస్ట్‌లు ఉన్నాయని దినేష్ తేజ్ తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్ తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు. తన పాత్ర ప్రయాణంలో చివరకు ఏం తెలుసుకుంటుంది, అసలు ‘తత్వం’ ఏమిటనేది కథలో కీలకంగా ఉంటుందని వెల్లడించారు.
తత్వం మూవీ
మూఢనమ్మకం.. నమ్మకం మధ్య సాగే కథ
మూఢనమ్మకానికి, నమ్మకానికి మధ్య ఉండే సన్నని గీత చుట్టూనే ‘తత్వం’ కథ తిరుగుతుందని దినేష్ తేజ్ చెప్పారు. 2000 సంవత్సరాన్ని నేపథ్యంగా తీసుకుని కథను తెరకెక్కించినట్లు తెలిపారు.
యాక్సిడెంట్ తర్వాత మరింత పెరిగిన నమ్మకం
సినిమా ప్రమోషన్ సమయంలో తనకు, హీరోయిన్‌కు యాక్సిడెంట్ జరిగిందని దినేష్ తేజ్ వెల్లడించారు. తనకు ఇది సెకండ్ లైఫ్ లాంటిదని పేర్కొన్నారు. మొదట కథ విన్నప్పుడు సినిమాపై ఎంత నమ్మకం కలిగిందో, ఇప్పుడు అంతకంటే ఎక్కువ విశ్వాసం ఉందన్నారు.
తత్వం మూవీ
కమర్షియల్ సక్సెస్ కంటే కథకే ప్రాధాన్యం
కేవలం కమర్షియల్ సక్సెస్ కోసం ‘తత్వం’ చేయలేదని దినేష్ తేజ్ స్పష్టం చేశారు. కథ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశానని, కొత్తదనం ఉన్న కథ కావడంతో అంగీకరించానని తెలిపారు. నటుడిగా ఈ చిత్రం తనకు పూర్తి సంతృప్తిని ఇచ్చిందన్నారు.
ఓటీటీ ఆఫర్లు వచ్చినా..
తనకు వెబ్‌సిరీస్ ఆఫర్లు వచ్చినప్పటికీ, తగినంత సంతృప్తినిచ్చే కథలు రాకపోవడంతో వాటిని అంగీకరించలేదని చెప్పారు.
తదుపరి ప్రాజెక్టులు ఇవే..
ప్రస్తుతం ‘హుషారు-2’తో పాటు విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన యాక్షన్ డ్రామాలో నటిస్తున్నట్లు దినేష్ తేజ్ తెలిపారు. సతీష్ వేగేశ్న కథా కేళి కూడా ఉందని వెల్లడించారు.
‘తత్వం’ తర్వాత కొత్త కథలకు తనను కూడా ఒక ఆప్షన్‌గా చూస్తారని ఆశ
ఈ సినిమా తర్వాత కొత్త కథలతో వచ్చే రచయితలకు తాను కూడా ఒక ఆప్షన్‌గా మారతాననే నమ్మకం ఉందని దినేష్ తేజ్ అన్నారు. సినిమా కోసం దర్శకుడు, నిర్మాతలు కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని చెప్పారు. “ఈ సినిమాకు కథే మా ధైర్యం.. ఆడియన్సే మా బలం” అంటూ సినిమా విజయంపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
తత్వం మూవీ





