జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గలీజు వ్యవహారం పెను దుమారం!**
అసెంబ్లీ సమావేశాల నడుమ మహిళతో వీడియో కాల్ – చరిత్రలోనే మచ్చగా మారిన ఘటన
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన శాసనసభ వేదికపై, సమావేశాలు జరుగుతుండగానే మహిళతో వీడియో కాల్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరవ శ్రీధర్ చర్యలు రాజకీయ వర్గాల్లో ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి.
బాధితురాలే విడుదల చేసిన వీడియో – తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందా?
అసెంబ్లీ ప్రాంగణం నుంచే మాట్లాడిన వీడియోను బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ స్వయంగా మీడియాకు విడుదల చేయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆరోపణలు వదంతుల స్థాయిని దాటి బహిరంగ ఆధారాలుగా మారాయి.
ప్రభుత్వ విప్ స్థాయి మరిచిన ప్రవర్తనా? శాసనసభ గౌరవానికి బహిరంగ అవమానం!
ప్రభుత్వ విప్‌గా కీలక బాధ్యతలు నిర్వహించే వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తన రావడం శాసనసభ ఔన్నత్యాన్ని దిగజార్చే చర్యగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీని వ్యక్తిగత వినోదానికి వాడుకున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
జనసేన మౌనం ఎందుకు? స్పీకర్, ప్రభుత్వ చర్యలపై ఉత్కంఠ
ఈ ఘటనపై ఇప్పటివరకు జనసేన పార్టీ నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటాయా? లేక మౌనమే కొనసాగుతుందా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారాయి.





