---Advertisement---

నెయ్యి ధరలపై అక్రమాల ఆరోపణలు పూర్తిగా అబద్ధం

---Advertisement---

మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజమా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన మరో అపోహనా? రూ.319–రూ.329కే కిలో నెయ్యి ఎలా సాధ్యమని ప్రశ్నలు లేవనెత్తుతున్న వేళ, గత ప్రభుత్వాల కాలంలో జరిగిన నెయ్యి కొనుగోళ్లు, ప్రభుత్వ బహిరంగ టెండర్ విధానం, నాణ్యత ప్రమాణాలు ఒక్కసారి పరిశీలిస్తే వాస్తవాలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. అప్పుడూ, ఇప్పుడూ నెయ్యి సరఫరా పారదర్శక ప్రక్రియలోనే జరిగిందన్న నిజం ఈ ఆరోపణలకు గట్టి సమాధానం ఇస్తోంది.

FAKE (అబద్ధం)

  • మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేశారని అక్రమాలు జరిగాయని ప్రచారం.
  • రూ.319 – రూ.329కి కేజీ నెయ్యి ఎలా సాధ్యమని అనుమానాలు.
  • తక్కువ ధర అంటే తప్పనిసరిగా కల్తీ లేదా అవకతవకలే అన్న తప్పుడు వాదన.

FACT (నిజం)

  • 2015లో చంద్రబాబు హయాంలో కిలో నెయ్యి రూ.276కే కొనుగోలు చేశారు.
  • 2019లో కూడా కిలో నెయ్యి రూ.324 – రూ.333 మధ్య కొనుగోలు జరిగింది.
  • అప్పటికీ, ఇప్పటికీ బహిరంగ మార్కెట్ ధరలు రూ.800 – రూ.1200 వరకు ఉన్నాయి.
  • నెయ్యి సరఫరా పూర్తిగా బహిరంగ ప్రభుత్వ టెండర్ విధానంలోనే జరుగుతోంది.
  • ప్రతి దశలో నాణ్యత పరీక్షలు, ప్రమాణాల తనిఖీలు తప్పనిసరి.

నెయ్యి ధరలపై జరుగుతున్న ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు లేవు. గతంలో నెయ్యి కొనుగోలు ప్రభుత్వ బహిరంగ టెండర్ ప్రక్రియలోనే జరిగింది. మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయడం కొత్త విషయం కాదు. కేవలం ధరను చూపించి అక్రమాలంటూ ప్రచారం చేయడం నిజం కాదు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment