---Advertisement---

ఏయూ స్వయం ప్రతిష్ఠకు బీటలు!

Summarize with AI

---Advertisement---

దేశంలోనే ఆంధ్రా విశ్వవిద్యాలయంపై ప్రైవేటు వర్సిటీ పెత్తన‌మేంటి?

ఆంధ్రా విశ్వవిద్యాలయంపై తీవ్ర ఆరోపణలు

దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రా విశ్వవిద్యాలయం కొద్ది నెలలుగా వివాదాల కేంద్రంగా మారింది. ఒక ప్రైవేటు యూనివర్సిటీ అధినేత ప్రభావంతోనే ఏయూలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు అధ్యాపక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.


ఎంపీ శ్రీభరత్ ఆదేశాల మేరకే వీసీ నిర్ణయాలా?

ప్రైవేటు యూనివర్సిటీ అధినేతగా మాత్రమే కాకుండా, విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న శ్రీభరత్ ఆదేశాల మేరకే ఆంధ్రా విశ్వవిద్యాలయ Vice Chancellor కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని Guest lecturers ఆరోపిస్తున్నారు.


కోట్లు ఆర్జించే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగం మూసివేతపై అనుమానాలు

ఏటా కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగాన్ని మూసివేయడం వెనుక ఆర్థిక ప్రయోజనాలే ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయం మరొక ప్రైవేటు యూనివర్సిటీకి లాభం చేకూర్చేందుకే తీసుకున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


వీసీ, రిజిస్ట్రార్ పాత్రపై అధ్యాపకుల ఆరోపణలు

ఈ వ్యవహారంలో ఏయూ Vice Chancellor ఆచార్య జి.పి. రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు కూడా సహకరిస్తూ విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు.


అధ్యాపకులు, విద్యార్థులకు అందని వీసీ

ఇటీవల కాలంలో ఏయూ ఉపకులపతి విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులకు కలుసుకునే అవకాశం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.


బహిరంగ వేదికపై ఎంపీ వ్యాఖ్యలు – వివాదానికి ఆజ్యం

ఏయూలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్, Vice Chancellor విశ్వవిద్యాలయంలోని అన్ని వర్గాలను కలుసుకునేందుకు ప్రత్యేక సమయం కేటాయించాలని సూచించినట్టు బహిరంగంగానే పేర్కొన్నారు. అదే సమయంలో ఏయూకి తన యూనివర్సిటీకి పోలికే లేదని, ఏయూలో ఎక్కువగా బలహీన వర్గాలు, పేదవర్గాల విద్యార్థులే చదువుకుంటారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.


ఏయూ భవిష్యత్తుపై ప్రశ్నార్థకం

ఈ పరిణామాలన్నీ కలిసి ఆంధ్రా విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తి, ప్రతిష్ఠపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజా విశ్వవిద్యాలయంపై ప్రైవేటు ప్రభావం పెరుగుతోందా అనే అంశం ఇప్పుడు విద్యా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment