పున్నమి ఘాట్‌లో సెప్టెంబర్ 30న జరిగిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం ఏర్పాట్ల కోసం రూ.1.50 కోట్లకు పరిపాలనా అనుమతి
సీఎం కార్యక్రమానికి రూ.1.50 కోట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న విజయవాడ పున్నమి ఘాట్‌లోని ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం ఏర్పాట్ల కోసం రూ.1.50 కోట్ల నిధులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 30, 2026న జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం అదనపు నిధులను మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన G.O.Rt.No.1899, తేదీ 30-09-2026 ప్రకారం.. కార్యక్రమం కోసం రూ.1.50 కోట్లను అదనపు నిధులుగా మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం G.A.D. ఆధ్వర్యంలోని ప్రోటోకాల్ ఖర్చుల కింద వినియోగించేందుకు అనుమతి ఇచ్చారు. TnIUSCBE
ఉత్తర్వుల ప్రకారం, తొలుత కార్యక్రమం కోసం రూ.2.50 కోట్ల నిధులు విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపగా.. ఆర్థిక శాఖ నుంచి రూ.1.50 కోట్లను అదనపు నిధులుగా ముందస్తుగా మంజూరు చేసినట్లు పత్రంలో ఉంది.
సీఎం కార్యక్రమానికి రూ.1.50 కోట్లు

మూడు గంటల కార్యక్రమం.. రూ.1.50 కోట్ల ఖర్చు?
పున్నమి ఘాట్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి కార్యక్రమం కోసం రూ.1.50 కోట్ల ప్రభుత్వ నిధులకు పరిపాలనా అనుమతి ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పేదల కోసం నిర్వహించిన కార్యక్రమం పేరుతో ఇంత మొత్తాన్ని ఏర్పాట్లకు కేటాయించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే, ఈ రూ.1.50 కోట్లు కేవలం ముఖ్యమంత్రి ప్రసంగానికి మాత్రమే ఖర్చు చేశారని ఉత్తర్వులు చెప్పడం లేదు. కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్ల కోసం అదనపు నిధులుగా మంజూరు చేసినట్లు అధికారిక ఉత్తర్వుల్లో ఉంది.
సీఎం కార్యక్రమానికి రూ.1.50 కోట్లు
అధికారిక ఉత్తర్వుల్లో ఏముంది?
- కార్యక్రమం: ‘పేదలకు పట్టాభిషేకం’
- వేదిక: పున్నమి ఘాట్, విజయవాడ
- తేదీ: 30 సెప్టెంబర్ 2026
- మంజూరైన అదనపు నిధులు: రూ.1.50 కోట్లు
- శాఖ: General Administration (Protocol-A) Department
- ఉత్తర్వు: G.O.Rt.No.1899
- నిధుల వినియోగం: కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్ల కోసం
అధికారిక ఉత్తర్వుల్లోని వివరాల ఆధారంగా చూస్తే.. రూ.1.50 కోట్ల కేటాయింపు మాత్రం స్పష్టంగా ఉంది. ఈ నిధుల్లో వాస్తవంగా ఎంత ఖర్చయింది, ఏయే ఏర్పాట్లకు ఎంత మొత్తం వెచ్చించారనే వివరాలు మాత్రం ఈ ఉత్తర్వులో లేవు.
సీఎం కార్యక్రమానికి రూ.1.50 కోట్లు







