ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం బలంగా ఉందన్న ప్రచారానికి భిన్నంగా, అధికారిక గణాంకాలు రైతులపై తీవ్రమైన అప్పుల భారాన్ని బయటపెట్టాయి. లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, దేశంలోనే అత్యధిక రైతు అప్పులు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
🔹 Claim
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం చాలా స్ట్రాంగ్, రైతులు ఆర్థికంగా బలంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

🔹 Reality
దేశంలో రైతులపై అత్యధిక అప్పుల భారం ఉన్న రాష్ట్రాల్లో టాప్–5లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ – 1వ స్థానం, తెలంగాణ – 5వ స్థానం
లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లిఖితపూర్వకంగా వెల్లడించిన అధికారిక గణాంకాలు
జూలై 2018 – జూన్ 2019 మధ్య
- ఏపీ రైతు కుటుంబం సగటు అప్పు: ₹2,35,554
- తెలంగాణ రైతు కుటుంబం సగటు అప్పు: ₹1,52,113
దేశవ్యాప్తంగా రైతు కుటుంబం సగటు అప్పు: ₹74,121


🧾 Conclusion
వ్యవసాయం స్ట్రాంగ్ అన్న మాటల కంటే, రైతులపై ఉన్న అప్పుల భారం నిజమైన పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది. అధికారిక గణాంకాలు ప్రచారాన్ని కాదు, వాస్తవాన్ని మాట్లాడుతున్నాయి.





