జగన్‌పై నమోదైన వాన్‌పిక్ కేసులో ఈడీకి వరుస ఎదురుదెబ్బలు.. 9 అప్పీళ్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న వాన్‌పిక్ (VANPIC) వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాన్‌పిక్ ఆస్తులను విడుదల చేయాలంటూ 2019లో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు తాజాగా సమర్థించింది. నాటి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేలా కొత్త ఆధారాలు, కొత్త కారణాలు లేదా చట్టపరంగా బలమైన అంశాలను ఈడీ చూపించలేదని స్పష్టం చేసిన హైకోర్టు, ట్రిబ్యునల్ ఆదేశాలను తక్షణమే యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది.
ఈడీ జప్తు సరికాదు

ఈడీ 9 అప్పీళ్లకు హైకోర్టు ‘నో’
వాన్‌పిక్ ఆస్తుల విడుదలను సవాల్ చేస్తూ ఈడీ తెలంగాణ హైకోర్టులో మొత్తం తొమ్మిది అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో దాదాపు ఏడేళ్లపాటు అన్ని వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం గత డిసెంబర్ 23న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా వెలువడిన తీర్పులో ఈడీ దాఖలు చేసిన తొమ్మిది అప్పీళ్లను కొట్టివేస్తూ అప్పిలేట్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సమర్థించింది.
ఇదే వ్యవహారంలో గతంలో కూడా మూడు కేసుల్లో హైకోర్టు ఉపశమనం కల్పించడం గమనార్హం.
అసలు వాన్‌పిక్ ప్రాజెక్టు ఏమిటి?
వాడరేవు-నిజాంపట్నం ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు (SEZలు), షిప్‌యార్డ్, విమానాశ్రయం వంటి భారీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వాన్‌పిక్ ప్రాజెక్టు ప్రతిపాదించబడింది.
ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమా ప్రభుత్వాల మధ్య ప్రభుత్వ-ప్రభుత్వ (G2G) విధానంలో రూపుదిద్దుకుంది.
ఈడీ జప్తు సరికాదు
సీబీఐ, ఈడీ కేసులు ఎలా నమోదయ్యాయి?
వాన్‌పిక్ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనాలు పొందిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కంపెనీల్లో రూ.863.33 కోట్ల పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి.
అనంతరం మనీలాండరింగ్ కేసులు నమోదు చేసిన ఈడీ పలు ఆస్తులను జప్తు చేసింది. ఈ జప్తు ఉత్తర్వులను అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించడంతో జగన్‌మోహన్‌రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు సంబంధిత కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి.
ఈడీ జప్తు సరికాదు
ట్రిబ్యునల్ ఏమంది?.. ఈడీ వాదనలను ఎందుకు తిరస్కరించింది?
సుదీర్ఘ విచారణ అనంతరం అప్పిలేట్ ట్రిబ్యునల్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
- వాన్‌పిక్ ప్రాజెక్టు అధికారికంగా అమల్లోకి రాకముందే సంబంధిత పెట్టుబడులు జరిగాయని పేర్కొంది.
- అందువల్ల ఆ పెట్టుబడులను ప్రాజెక్టుకు ప్రతిఫలంగా ఇచ్చినవిగా లేదా ‘క్విడ్ ప్రో కో’గా పేర్కొనలేమని స్పష్టం చేసింది.
- అక్రమ పెట్టుబడులు జరిగాయని నిరూపించే ఎలాంటి ఆధారాలు కూడా ఈడీ సమర్పించలేదని అభిప్రాయపడింది.
- ఈడీ జప్తు చేసిన ఆస్తులను వెంటనే విడుదల చేయాలని 2019 జూలైలో ఆదేశాలు జారీ చేసింది.
ఈడీ జప్తు సరికాదు
జగతి పబ్లికేషన్స్ ఆస్తులపై కూడా కీలక వ్యాఖ్యలు
అనేక మంది ఉద్యోగులు పనిచేస్తున్న జగతి పబ్లికేషన్స్ ఆస్తుల బదిలీని నిలిపివేస్తూ ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ట్రిబ్యునల్ గుర్తుచేసింది.
దీంతో ఆ సంస్థకు సంబంధించిన రూ.273.39 కోట్ల విలువైన ప్లాంట్, యంత్రాల జప్తును కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఈడీ జప్తు సరికాదు
60 మంది పెట్టుబడిదారుల్లో కొందరిపైనే చర్యలు ఎందుకు?
మొత్తం 60 మంది పెట్టుబడిదారులు ఒక్కో షేరును రూ.360 చొప్పున కొనుగోలు చేసిన విషయాన్ని ఈడీ తరఫు న్యాయవాది కూడా కాదనలేదని ట్రిబ్యునల్ నమోదు చేసింది.
అయితే ఆ 60 మందిలో 45 మంది పెట్టుబడిదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కొందరిని మాత్రమే ప్రత్యేకంగా ఎంచుకొని వారి పెట్టుబడులను ‘క్విడ్ ప్రో కో’గా అభివర్ణించడం వెనుక ‘ఎంపిక చేసుకునే విధానం’ కనిపిస్తోందని ట్రిబ్యునల్ తీవ్ర సందేహం వ్యక్తం చేసింది.
ఈడీ జప్తు సరికాదు
దర్యాప్తు సంస్థల జోక్యంపై ఘాటు వ్యాఖ్యలు
ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవడం సరికాదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. సరైన ఆధారాలు లేకుండా మనీలాండరింగ్ ఆరోపణలు చేస్తూ ఆస్తులను జప్తు చేయడం చట్టబద్ధంగా నిలబడదని పేర్కొంది. కొత్త ఆధారాలు లేకుండానే జప్తు ఉత్తర్వులను కొనసాగించాలని ఈడీ చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు కూడా తిరస్కరించింది.
ఈడీ జప్తు సరికాదు
ఈడీకి తెలంగాణ హైకోర్టులో భారీ షాక్..! ‘ఈడీ జప్తు సరికాదు’.. వాన్‌పిక్ ఆస్తుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్
వాన్‌పిక్ కేసులో ఈడీ దాఖలు చేసిన తొమ్మిది అప్పీళ్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడం, 2019లో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆస్తుల విడుదల ఉత్తర్వులను సమర్థించడం ద్వారా ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వాన్‌పిక్ వ్యవహారంలో ఈడీ జప్తు చర్యలకు కొత్త ఆధారాలు లేవని, ట్రిబ్యునల్ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంతో, జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో ఈ తీర్పు రాజకీయంగానూ, న్యాయపరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈడీ జప్తు సరికాదు







